చిన్నారి చురుకుదనానికి...

పిల్లలకు చదువుతోపాటు మంచి, చెడు గురించి చెప్పడమేకాదు, వారిలో ప్రపంచజ్ఞానాన్ని పెంచాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. అప్పుడే చురుగ్గా మారతారు. అందుకోసమే ఈ సూచనలు...

Published : 12 Jul 2021 01:45 IST

పిల్లలకు చదువుతోపాటు మంచి, చెడు గురించి చెప్పడమేకాదు, వారిలో ప్రపంచజ్ఞానాన్ని పెంచాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. అప్పుడే చురుగ్గా మారతారు. అందుకోసమే ఈ సూచనలు...

* శరీరంలోని అవయవాలు పనిచేసే కొద్దీ అలసిపోయే అవకాశం ఉంది. అయితే మెదడు మాత్రం ఎంత ఎక్కువ పనిచేస్తే అంత చురుకుగా మారుతుంది. అందుకే మెదడును పదునెక్కించేలా పిల్లలతో ఖాళీ సమయాల్లో సరదాతో కూడిన పజిల్స్‌ పూర్తిచేయించడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

* ఉన్నతవిద్యాభ్యాసం కోసం మాత్రమే కాకుండా వారిలో మానసిక సామర్థ్యం పెంచడానికి తల్లిదండ్రులు నిత్యం ప్రోత్సహించాలి. అది వారికి సంతోషాన్ని, ఉత్సాహాన్ని అందించేలా ఉండాలి. డ్రాయింగ్‌ లేదా చెస్‌, క్రికెట్‌ వంటి క్రీడల్లో వారికిష్టమైనదాన్ని ఎంచుకోనిస్తే, ఆ ఆసక్తి వారిని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్