పిల్లల్ని చులకన చేయొద్దు...

ఇంటికెవరొచ్చినా ‘మా అమ్మాయి బాగా డ్యాన్స్‌ చేస్తుంది. కానీ ఎవరైనా చూస్తే మాత్రం సిగ్గుపడుతుంది’ అంటూ అమ్మ చెప్పడం ఏడేళ్ల హాసినికి నచ్చదు. దాంతో తన కళను ప్రదర్శించకపోవడమే కాదు, డ్యాన్స్‌నే మానేయాలనుకుంది.

Published : 13 Jul 2021 02:58 IST

ఇంటికెవరొచ్చినా ‘మా అమ్మాయి బాగా డ్యాన్స్‌ చేస్తుంది. కానీ ఎవరైనా చూస్తే మాత్రం సిగ్గుపడుతుంది’ అంటూ అమ్మ చెప్పడం ఏడేళ్ల హాసినికి నచ్చదు. దాంతో తన కళను ప్రదర్శించకపోవడమే కాదు, డ్యాన్స్‌నే మానేయాలనుకుంది. అమ్మా నాన్నలు ఇలా చేయడం వల్ల పిల్లల విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరేం చేయాలి?

ప్రశంసించాలి...:  పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఇతరుల ముందు హేళన చేస్తూ మాట్లాడటం మంచిదికాదు. దాని వల్ల చిన్నారుల్లో ఆత్మన్యూనత మొదలవుతుంది. తామేదీ సాధించలేమనే ప్రతికూల ఆలోచనలు వస్తాయి. మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని మాట్లాడటం మంచిది కాదు. ఒకవేళ వెనకబడితే... నువ్వు ప్రయత్నించావు. ఈ సారి మరింత శ్రద్ధగా చదువు అంటూ వారి వెన్ను తట్టాలి. వారి శ్రమని గుర్తించి ప్రోత్సహిస్తే... మీరు కోరుకున్న లక్ష్యాలను వారు సాధించగలరు.

భయానికి దూరంగా...  ‘నీకే పనీ రాదు. చేయలేవు’ అనే మాటలు వారిలో భయాన్ని నింపుతాయి. ఈ అలవాటే కొనసాగితే...ప్రతి అడుగూ సంశయిస్తూనే వేస్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. అలాకాకుండా నువ్వు సాధించగలవనే నమ్మకాన్ని కలిగించండి. అవసరమైన సమయాల్లో అండగా నిలబడండి. అనుకున్నది చేస్తారు.

అవమానించొద్దు... చిన్నతనంలో తెలియక ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు తల్లిదండ్రులు వారిని మృదువుగా మార్చడానికి ప్రయత్నించాలి. ఆ తప్పు మరోసారి చేయకూడదనే ఆలోచన రప్పించాలి. అలా కాకుండా ఆ చిన్నచిన్న తప్పులను ఎదుటి వారి ముందు చెప్పి వారిని అవమానించకూడదు. ఇది ఆత్మన్యూనతను కలిగిస్తుంది. అందరిలోకీ వెళ్తే అమ్మా నాన్నలు తన గురించి ఏం చెబుతారో అనే భయం వారిని వెంటాడి, నలుగురిలో కలవడం మానేస్తారు. ఇది వారిని ఒంటరితనంలోకి నెట్టేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్