చిట్టి దంతాలు ఇలా భద్రం

పిల్లల దంత సమస్యలను నిర్లక్ష్యం చేస్తే పెద్ద అనారోగ్యాలకు దారితీయచ్చని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

Published : 15 Jul 2021 00:42 IST

పిల్లల దంత సమస్యలను నిర్లక్ష్యం చేస్తే పెద్ద అనారోగ్యాలకు దారితీయచ్చని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఇలా జరక్కుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు అలవరచాలో సూచిస్తున్నారు.

* ఆహారంలో... పిల్లలు కార్బోహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉండే కేకులు, కుకీస్‌, పాలు, పండ్ల రసం వంటి ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. తీపి పదార్థాల అవశేషాలు దంతాలపై ఎక్కువసేపు ఉంటే అనారోగ్యాలకు కారణమవుతాయి. అందుకే తాజా పండ్లు, కూరగాయలతో చేసే స్నాక్స్‌ను పిల్లలకు అలవాటు చేయాలి. నీటిని ఎక్కువగా తాగించాలి. ఏం తిన్నా, తాగినా వెంటనే నోరు పుక్కిలించడం నేర్పించాలి.

* అంటుకోకుండా... పీనట్‌ బటర్‌ కుకీస్‌, జెల్లీ మిఠాయిలు, చాక్లెట్లు వంటివి తిన్నప్పుడు వాటి అవశేషాలు దంతాల మధ్య చిక్కుకుంటాయి. వెంటనే శుభ్రం చేసుకోకపోతే తర్వాత అనారోగ్యాల్ని తెచ్చిపెడతాయి. అందుకే వీలైనంత వరకూ ఇటువంటి పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచితే మంచిది. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు బ్రష్‌ చేసుకోవడం నేర్పాలి. బాల్యం నుంచి వారే రోజూ రెండు సార్లు బ్రష్‌ చేసుకునేలా అలవాటు చేస్తే, అది దినచర్యలో భాగంలా మార్చుకుంటారు. ఇది వారిని దంత క్షయాల బారి నుంచి కాపాడుతుంది. అలాగే ఆహారం ద్వారా కాల్షియం అందేలా చూడాలి. పాలు, పెరుగు, బాదం, గింజధాన్యాలు వంటి వాటిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది వారి చిగుళ్లు, దంతాలను సంరక్షిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్