కథ చెప్పండిలా...

పిల్లలకు కథలు చెప్పడం నిద్రపుచ్చడానికి మాత్రమే కాదు.. వాళ్లదైన ఊహా లోకంలోకి తీసుకెళ్లి, నిద్రాణంగా ఉండే సృజనాత్మక శక్తిని పెంచడానికి కూడా!

Published : 23 Jul 2021 01:07 IST

పిల్లలకు కథలు చెప్పడం నిద్రపుచ్చడానికి మాత్రమే కాదు.. వాళ్లదైన ఊహా లోకంలోకి తీసుకెళ్లి, నిద్రాణంగా ఉండే సృజనాత్మక శక్తిని పెంచడానికి కూడా!

ముందు పెద్దలు కొన్ని మంచి కథలు చదవాలి. లేదా చిన్నప్పుడు విన్న కథలనైనా జ్ఞప్తికి తెచ్చుకుని సంక్షిప్తంగా రాసి పెట్టుకోవాలి. చెప్పబోయే కథ సందర్భానికి అనువైనదిగా ఉండాలి. అప్పుడే పిల్లల్లో ఆసక్తి పెరుగుతుంది.

* ఇలా మన సాహిత్యం, చరిత్ర, ఇతిహాసాలు, పురాణాలు... ఇతరత్రా సామాజిక అంశాలను వారికి అర్థమయ్యేలా చెప్పొచ్చు. ఇవి వారి మనోవికాసానికి తోడ్పడతాయి.

* మొబైళ్లు, టీవీ వంటి గ్యాడ్జెట్లకు పిల్లలు దూరంగా ఉండాలంటే... కథలు చెప్పేందుకు పెద్దలు కొంత సమయం కేటాయించాల్సిందే. ఇవి వారిలో భావోద్వేగాలను వృద్ధి చేస్తాయి అంటున్నారు మానసిక నిపుణులు. పిల్లలకు వీటి ద్వారా కొత్తకొత్త పదాలు పరిచయం చేయవచ్చు. ఏదైనా పదం వింతగా ధ్వనిస్తే, చిన్నారులు దాని అర్థం తెలుసుకునేందుకు ఉత్సుకత చూపుతారు. తద్వారా వారికి భాషాసంపద అందించినట్టు అవుతుంది.

* కథల ద్వారా వినగలిగే సామర్థ్యం కూడా మెరుగువుతుంది. క్లాస్‌ రూంలో పిల్లలు వినడం కన్నా మాట్లాడడానికే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే, వారు మంచి శ్రోతలు కారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కథలు వినడాన్ని గనుక వారికి అలవాటు చేస్తే... విషయ గ్రహణ సామర్థ్యం పెంపొందుతుంది. ఫలితంగా చదువులోనూ ముందుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్