వారి భావోద్వేగాలను నిర్లక్ష్యం చేయొద్దు...

పిల్లల భావోద్వేగాలను పెద్దవాళ్లు గుర్తించాలని అంటున్నారు మానసిక నిపుణులు. నిర్లక్ష్యం చేస్తే వారిలో ఆత్మన్యూనత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Published : 29 Jul 2021 01:40 IST

పిల్లల భావోద్వేగాలను పెద్దవాళ్లు గుర్తించాలని అంటున్నారు మానసిక నిపుణులు. నిర్లక్ష్యం చేస్తే వారిలో ఆత్మన్యూనత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వారి ఎదుగుదలకు ఇది ఆటంకం కాకుండా ఉండాలంటే ఏం చేయాలో సూచిస్తున్నారు.

క్రమశిక్షణ పేరుతో.. కొందరు తల్లిదండ్రులు సమయపాలన పేరుతో పిల్లలను ఇబ్బంది పెడుతూ ఉంటారు. క్రమశిక్షణ లేకపోతే వారి భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడతారు. మరికొందరైతే,  పిల్లలు చెప్పేది వినకుండా, తాము చెప్పేదే పాటించాలని హెచ్చరిస్తారు. పిల్లలపైనే అపనమ్మకాన్ని ప్రదర్శిస్తారు. ఇవన్నీ తీవ్ర ఒత్తిడిని కలిగించి, వారిలో ప్రతికూల భావాలను నింపుతాయి. అలా జరగకుండా ఉండాలంటే పెద్దవాళ్లు పిల్లల మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలి. క్రమశిక్షణ పాటించడానికి వారి మానసిక స్థితి ఎలా ఉందో గుర్తించాలి. ఆ సమయంలో వారి భావోద్వేగాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. వారి మనసును తెలుసుకొని, మృదువుగా వ్యవహరించాలి.
అవగాహన... ఇంట్లో పిల్లలతో సమయం దొరికినప్పుడు తల్లిదండ్రులు తమ గురించి చెప్పాలి. జీవిత అనుభవాలను, చిన్నప్పటి సంగతుల గురించి వారితో మాట్లాడుతూ ఉండాలి. అమ్మానాన్నలే చిన్నారులకు తొలి హీరోలు. తాము ఎలా భవిష్యత్తును నిర్మించుకున్నామో, అందులో పడిన ఇబ్బందులు, కష్టాలు, ఎదురైన ఛాలెంజ్‌ల గురించి వివరించి చెబుతుంటే, ఇవన్నీ పిల్లల్లో స్ఫూర్తిని కలిగిస్తాయి. వారిలో మంచి, చెడులపై అవగాహన పెరుగుతుంది. ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా ఆలోచించడం నేర్చుకుంటారు. క్రమేపీ అది వారిని క్రమశిక్షణాయుతమైన వ్యక్తులుగా మారుస్తుంది. చిన్నప్పటి నుంచి అభిరుచి, ఆసక్తుల దిశగా ప్రోత్సహించాలి. వారు చెప్పే దానిపై నమ్మకాన్ని ఉంచాలి. అది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, భవిష్యత్తులో విజయాలను సాధించేలా చేస్తుంది..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్