తోబుట్టువుల తగాదాలు తీర్చేద్దాం!

అమ్మా చూడు తమ్ముడు నా పెన్సిల్‌ తీసుకున్నాడు. ఇమ్మంటే కొడుతున్నాడు. ఓ చిచ్చర పిడుగు కంప్లైట్‌. కాదమ్మా అక్కే నన్ను కొడుతోంది... అంటూ ఓ చెల్లి ఫిర్యాదు. పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ ఇలాంటి పోట్లాటలు సర్వసాధారణం...

Published : 15 Aug 2021 01:13 IST

అమ్మా చూడు తమ్ముడు నా పెన్సిల్‌ తీసుకున్నాడు. ఇమ్మంటే కొడుతున్నాడు. ఓ చిచ్చర పిడుగు కంప్లైట్‌. కాదమ్మా అక్కే నన్ను కొడుతోంది... అంటూ ఓ చెల్లి ఫిర్యాదు. పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ ఇలాంటి పోట్లాటలు సర్వసాధారణం. ఇలాంటప్పుడు వారికెలా సర్దిచెప్పాలో సూచిస్తున్నారు మానసిక నిపుణులు.

పిల్లలు గొడవపడుతుంటే... దాన్ని ఆపడానికి వారిని కొట్టడం, తిట్టడం చేయొద్దు. ముందు తగాదాకు కారణం తెలుసుకోండి. తర్వాతే పరిష్కారాన్ని సూచించండి. చిన్నవాడనో, పెద్దదనో పక్షపాతంగా తీర్పులివ్వొద్దు. తప్పెవరిదో వారు సరిదిద్దు కోవాల్సిందే అని సున్నితంగానే హెచ్చరించండి.

* చిన్నారుల గొడవలకు, అసూయలకు తల్లిదండ్రులూ ఒక్కోసారి కారణం అవుతుంటారు. ప్రతి చిన్న విషయానికీ మరొకరితో పోల్చడం వల్ల ఆత్మన్యూనతకు గురయ్యే ప్రమాదం ఉంది. అలానే అభద్రతతో, అసహనంతో అకారణంగా పోట్లాటకు దిగొచ్చు. అందుకే అలా చేయొద్దు. ‘అక్క నీకు సాయం చేస్తుంది... నువ్వూ త్వరగా నేర్చుకోవచ్చు’ అనో, ‘తమ్ముడికి నువ్వంటే ఎంతిష్టమో నీతో కలిసి చేస్తానంటున్నాడనో’ నచ్చజెప్పండి. సంతోషంగా వారిని స్వీకరిస్తారు.

* పిల్లలకు ఒంటరిగా ఉన్నామనే భావన వస్తే అభద్రతకు లోనవుతారు. చిరాకు, కోపం లాంటి లక్షణాల ద్వారా ఆ అశక్తతను ప్రదర్శిస్తారు. కాబట్టి  రోజూ వీలైనంత సమయాన్ని వారితో గడపటానికి ప్రయత్నించండి. ఏ విషయాన్నైనా ప్రేమతో, ఓర్పుతో అర్థమయ్యేలా చెప్పండి. ఇద్దరినీ అన్ని విషయాల్లో సమానంగా చూడటం తప్పనిసరి. ఇక, కొందరు పిల్లలు గొడవపడరనే ఆలోచనతో... ఏం కొన్నా ఒకేలాంటివి తెస్తుంటారు. అలాకాకుండా... వారికి నచ్చేవి కొనివ్వండి. ఎవరి వస్తువుని వారు భద్రంగా ఉంచుకోకపోతే... మరోసారి ఎంచుకునే అవకాశం ఇవ్వనని చెప్పండి. గొడవ పడకుండా సర్దుబాటు చేసుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్