అంచనాలు వద్దు... ఆనందమే ముద్దు

భాగస్వామి మీద కొందరికి భారీ అంచనాలు ఉంటాయి. ఎదుటి వాళ్లు ఎప్పుడూ తమను ఆశ్చర్యపరచాలనీ, ఆనందంలో ముంచేయాలని కోరుకుంటారు. తమ అంచనాలకు తగ్గట్టుగా భాగస్వామి

Published : 16 Aug 2021 01:11 IST

భాగస్వామి మీద కొందరికి భారీ అంచనాలు ఉంటాయి. ఎదుటి వాళ్లు ఎప్పుడూ తమను ఆశ్చర్యపరచాలనీ, ఆనందంలో ముంచేయాలని కోరుకుంటారు. తమ అంచనాలకు తగ్గట్టుగా భాగస్వామి ప్రవర్తించకపోతే... కుంగిపోతుంటారు. నిరాశకు లోనవుతుంటారు. అలాకాకుండా మీ జీవితం హాయిగా...సంతోషంగా సాగిపోవాలంటే...

* సినిమాల్లో, పుస్తకాల్లో చూపినట్లు... జీవితంలోనూ అద్భుతాలు జరగాలని ఊహించుకోవడం సరికాదు. పరిస్థితుల్ని అర్థం చేసుకుని సంతోషాన్ని సంసారంలో నింపుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంటుందని గుర్తించాలి. ఒకవేళ మీ ఆశల్ని అవతలి వారు గుర్తించలేకపోతే... వాటిని తెలిసేలా చేయండి. మీకేది నచ్చుతుందో చెప్పండి. క్రమంగా వారిలో మార్పు వస్తుంది. ఎవరూ మీ మనసులోకి వెళ్లి తెలుసుకోలేరు కదా!

* అనుకున్నవన్నీ అప్పటికప్పుడు జరిగిపోవాలని ఆశించవవద్దు. వాటికోసం పట్టుపట్టొద్దు. అవతలి వారి పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా బలవంతంగా ఒప్పించడం వల్ల ఇద్దరి మధ్యా అగాథం ఏర్పడుతుంది. అన్నీ మీకు మీరే అనుకుని ఎదురు చూడటం వల్ల నిరాశే మిగులుతుంది. బదులుగా ముందుగానే... ఇద్దరూ కలిసి నిర్ణయించుకుంటే అలా బాధపడే పరిస్థితి ఎదురుకాదు.

* ఆలుమగలు అయినంత మాత్రాన... అన్నింటికీ అవతలి వారిదే బాధ్యత అన్నట్లు ప్రవర్తించడం తప్పు. భర్త ఇంటి పనులు, వంట చేసుకోవడంలో అయినా, భార్య... బయట కెళ్లి కొన్ని పనులు పూర్తి చేసుకోవడంలో అయినా... చొరవతో పాటు సర్దుబాటు, సహనం తప్పనిసరి. అప్పుడే ఆ సంసారం ఆనందంగా సాగిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్