వింటే పరిష్కారమే!

సంసారం అన్నాక... సమస్యలు ఉండవా ఏంటి? అయితే వాటిని తెగే దాకా లాగకూడదన్నా, అవి త్వరగా సర్దుబాటు అవ్వాలన్నా... ఒకరి మాట మరొకరు పూర్తిగా వినాలంటున్నారు మానసిక నిపుణులు. మరికొన్ని సూచనలూ చేస్తున్నారు.

Published : 17 Aug 2021 01:43 IST

సంసారం అన్నాక... సమస్యలు ఉండవా ఏంటి? అయితే వాటిని తెగే దాకా లాగకూడదన్నా, అవి త్వరగా సర్దుబాటు అవ్వాలన్నా... ఒకరి మాట మరొకరు పూర్తిగా వినాలంటున్నారు మానసిక నిపుణులు. మరికొన్ని సూచనలూ చేస్తున్నారు.

ఎత్తిపొడవొద్దు: జీవిత గమనంలో కొన్ని పొరబాట్లు దొర్లుతుంటాయి. కొన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేని చిన్నవి కాగా... మరికొన్నింటి ఫలితం ఇబ్బందుల్లోకి నెట్టేయొచ్చు. అందుకు కారణం ఎవరైనా ముందు బయటపడే మార్గాల్ని వెతకాలే తప్ప ఒకరినొకరు ఎత్తిపొడుచుకోవద్దు.

మాట్లాడుకోండి: ఆలుమగలుగా...బాధ్యతలు, ఇబ్బందులు...అన్నీ ఇద్దరూ కలిసే పంచుకోవాలి. ఇలాంటప్పుడు ఒకరిమాట మరొకరు వినకుండా... నీకేం తెలియదు... అంటూ కొట్టిపారేయొద్దు. మీ తీరు ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది తప్ప పరిష్కారాన్ని చూపించదు. పరస్పరం మాట్లాడుకోవడం వల్ల ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది.

దూషణవద్దు: కొందరు గొడవ పడగానే భాగస్వామి గురించి వ్యంగ్యంగా మాట్లాడటం, తక్కువచేసి మాట్లాడటం, అదుపుతప్పి... దూషించడం చేస్తుంటారు. మీ వాదనే నెగ్గాలని ప్రయత్నించకండి. అవతలివారు ఏం చెబుతున్నారో వినండి. వారిదే పొరబాటు అయితే... గొంతు తగ్గించి మాట్లాడండి. మీ వల్లే సమస్య ఎదురైతే క్షమించమని అడగడానికి వెనుకాడొద్దు. నిజానికి కోపంగా ఉన్నప్పుడు ఎదుటివారి మాట వినడం కాస్త కష్టమే అయినా... అసాధ్యమేమీ కాదు. అప్పుడే సంసారం సంతోషంగా సాగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్