ఒంటరి పెంపకంలో...

అమ్మానాన్నలు వేర్వేరుగా ఉన్నప్పుడో లేదా ఒకరిని కోల్పోయినప్పుడో పిల్లలు రెండో వారి దగ్గరే పెరుగుతారు. ఇలాంటి పిల్లల్లో ఆత్మనూన్యత, భయం ఉంటాయనుకుంటాం. కానీ వారిలో చిన్నప్పటి నుంచి బాధ్యతాయుతమైన గుణాలు పెంపొందుతాయని ‘2019-20 యునైటెడ్‌ నేషన్స్‌ వుమెన్‌’ అధ్యయనం తేల్చింది. మన దేశంలో 4.5 శాతం తల్లి లేదా తండ్రులు ఒంటరిగానే పిల్లలను పెంచుతున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ...

Updated : 19 Aug 2021 12:47 IST

అమ్మానాన్నలు వేర్వేరుగా ఉన్నప్పుడో లేదా ఒకరిని కోల్పోయినప్పుడో పిల్లలు రెండో వారి దగ్గరే పెరుగుతారు. ఇలాంటి పిల్లల్లో ఆత్మనూన్యత, భయం ఉంటాయనుకుంటాం. కానీ వారిలో చిన్నప్పటి నుంచి బాధ్యతాయుతమైన గుణాలు పెంపొందుతాయని ‘2019-20 యునైటెడ్‌ నేషన్స్‌ వుమెన్‌’ అధ్యయనం తేల్చింది. మన దేశంలో 4.5 శాతం తల్లి లేదా తండ్రులు ఒంటరిగానే పిల్లలను పెంచుతున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. మొత్తం 13 మిలియన్ల కుటుంబాలు ఈ తరహాలోనే పిల్లలను పెంచుతున్నాయి.

వ్యక్తిగతంగా

ఇంట్లో ప్రతి విషయాన్నీ తల్లి లేదా తండ్రి ఒక్కరే బాధ్యతాయుతంగా చూసుకోవడం పిల్లలు గుర్తిస్తారు. దాంతో వారికీ ప్రతి విషయంపై అవగాహన పెరుగుతుంది. ప్రతి నెలా అయ్యే ఖర్చు మొదలు వ్యక్తిగతంగా ఎంత డబ్బు అవసరం అనే అంశాల గురించి ఆలోచించడం మొదలుపెడతారు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వెనుక ఉండే కష్టాన్ని వారు తెలుసుకుంటారు. కష్టపడే తల్లికి ఇంటి పనుల్లో సాయం చేస్తారు. ప్రతి కష్టాన్నీ వారితో పంచుకుంటారు. స్నేహితులుగా మెలిగే తత్వం పిల్లల్లో అలవడుతుంది. పది పన్నెండేళ్లకే తల్లికి సలహా ఇచ్చే స్థాయికి ఎదుగుతారు.

స్ఫూర్తిగా

తల్లి లేదా తండ్రి వద్ద పెరిగే పిల్లలకు వారే స్ఫూర్తి. పెద్దవాళ్లు నిర్వర్తించే బాధ్యతలను గమనిస్తూ, వారినే ఆదర్శంగా తీసుకుంటారు. బాగా చదువుకుని మంచి ఉద్యోగాన్ని తెచ్చుకోవాలి, ఉన్నతస్థాయికెదగాలనే ఆలోచనలు వారికి చిన్నప్పటి నుంచే మొదలవుతాయి. ఇతరులతో స్నేహంగా మెలగడం, ఉన్నదాంట్లో ఎదుటివారికి పంచడం వంటి అలవాట్లను నేర్చుకుంటారు. వీరిలో దయాగుణం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అనుకున్నట్లుగానే చదువులో ముందంజలో ఉండి, ఉన్నత విద్యాభ్యాసం చేయాలనే కలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తారు.

సమస్యకు

ఆర్థికపరమైన లేదా సామాజికపరమైన సమస్యలకు పిల్లలు వెంటనే స్పందిస్తారు. వాటిని పరిష్కరించే దిశగా పెద్దవాళ్లకు ఆలోచన చెప్పే స్థాయికెదుగుతారు. ఎందుకంటే అందులోని సాంద్రతను అనుభవపూర్వకంగా తెలుసుకునే పరిణితి వారిలో ఉంటుంది. వేదన కలిగించే సందర్భాల్లో తల్లికి నేనున్నాననే భరోసా ఇస్తారు. ఆర్థిక ప్రణాళిక వేయడమే కాదు, ఆ దిశగా పొదుపు చేయాలనే ఆలోచన చిన్నప్పుడే పిల్లలకు అలవడుతుంది. ఒంటరిగా తనను పెంచడానికి అమ్మ పడే కష్టాన్ని అర్థం చేసుకుంటూ, దానికి తగినట్లుగా నడుచుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్