బాధ్యత తెలిస్తేనే బంధం పదిలం

ఆలుమగలు ఇద్దరూ పనిచేస్తేనే కానీ గడవని రోజులివి. వేర్వేరు పనివేళలు, పనుల ఒత్తిడి ఇద్దరి మధ్య అలకల్ని, అపార్థాల్ని పెంచుతాయి. ఇలాంటప్పుడు తప్పొప్పులు ఎంచుకోవడం కంటే... బాధ్యత తెలుసుకుని మసలితే మేలంటున్నారు నిపుణులు....

Published : 19 Aug 2021 02:57 IST

ఆలుమగలు ఇద్దరూ పనిచేస్తేనే కానీ గడవని రోజులివి. వేర్వేరు పనివేళలు, పనుల ఒత్తిడి ఇద్దరి మధ్య అలకల్ని, అపార్థాల్ని పెంచుతాయి. ఇలాంటప్పుడు తప్పొప్పులు ఎంచుకోవడం కంటే... బాధ్యత తెలుసుకుని మసలితే మేలంటున్నారు నిపుణులు.

భార్యాభర్తలు ప్రేమాభిమానాలు చూపించుకోవడం ఎంత ముఖ్యమో... ఎవరి బాధ్యతల్ని వారు అర్థం చేసుకోవడమూ అంతే అవసరం. బాధ్యత అనగానే బరువైనదిగా భావించొద్దు. ఇంటి అవసరాలను, కుటుంబ సభ్యుల సమస్యలను అర్థం చేసుకోవడమూ బాధ్యతే. ఆలుమగల మధ్య అభద్రత మొదలైతే.... ఇది ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే ఒకరినొకరు అర్థం చేసుకుని సాగిపోవాలి.

పని ఒత్తిడి మీ జీవన శైలిలో భాగం కావొచ్చు. అలాగని దీర్ఘకాలం ఆ ప్రభావం ఉంటే... ఒకరికొకరు భారంగా మారతారు. అందుకే దాన్ని క్రమబద్ధీకరించుకోండి. పని విభజన చేసుకోండి. ప్రాధాన్యతా క్రమంలో ప్రణాళికాబద్ధంగా అడుగులేయండి. ఇవన్నీ మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాయి.

ఇంటిపనైనా, ఆఫీసు ఉద్యోగమైనా ఎవరిస్థాయికి వారికి అవి ముఖ్యం అని మరిచిపోకుండా ప్రవర్తించండి. అవతలివారిని తక్కువ చేసి మాట్లాడకండి. మీకు నచ్చినట్లు మీరు ఉండాలనుకుంటున్నట్లే... ఎదుటివారికీ అభిప్రాయాలు ఉంటాయని గుర్తించండి. వాటిని గౌరవిస్తే...సమస్యలు దరిచేరవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్