పిల్లల సయోధ్య...పెద్దల బాధ్యత

అర్చన సమస్య పిల్లలే. పెద్దవాడికి ఎనిమిదేళ్లు, పాపకు ఆరేళ్లు. ఇద్దరికీ క్షణం పడదు. చిన్నచిన్న విషయాలకే చాడీలు చెప్పడం, కొట్టుకోవడం. వారికి సయోధ్య ఎలా కుదర్చాలో తెలియక సతమతవుతోంది. ప్రతి ఇంట్లో ఎదురయ్యే  ఈ సమస్యకు పరిష్కారం కూడా తేలికే అంటున్నారు మానసిక నిపుణులు.

Published : 25 Aug 2021 01:15 IST

అర్చన సమస్య పిల్లలే. పెద్దవాడికి ఎనిమిదేళ్లు, పాపకు ఆరేళ్లు. ఇద్దరికీ క్షణం పడదు. చిన్నచిన్న విషయాలకే చాడీలు చెప్పడం, కొట్టుకోవడం. వారికి సయోధ్య ఎలా కుదర్చాలో తెలియక సతమతవుతోంది. ప్రతి ఇంట్లో ఎదురయ్యే  ఈ సమస్యకు పరిష్కారం కూడా తేలికే అంటున్నారు మానసిక నిపుణులు.

అలా చేయొద్దు... చిన్నపిల్లలను కాస్త గారాబంగా చూడటం పెద్దవాళ్లకు అసూయ కలిగిస్తుంది. దీన్ని కోపంగా మార్చుకుంటారు. సమయం దొరికినప్పుడల్లా తమ్ముడు లేదా చెల్లిపై చాడీలు చెప్పడం, వారిపై దాడి చేయడం చేస్తారు. చిన్నవారిని తప్పు పట్టేలా చేయడానికి ప్రయత్నిస్తారు. దాంతో ఇదొక సమస్యగా మారుతుంది. అమ్మా నాన్నకు తనపై ప్రేమ రావాలని మనసులో కోరుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులకు ఇద్దరూ ఒకటే అనే విషయం ఆ చిన్నారులకు తెలియదు. అలాకాకుండా ఇద్దరినీ సమానంగా చూడటం, తమ తమ్ముడు లేదా చెల్లెలిపై ప్రేమ కలిగేలా వారికి అవగాహన కలిగించడం పెద్దవాళ్లు చేయాలి. చిన్నవాడు కదా, వాడికి అన్నీ మనమే నేర్పాలి అంటూ పెద్దరికం ఇస్తే చాలు. దాన్నొక బాధ్యతగా భావించి పెద్దపిల్లలు చిన్న వారిపై కోపాన్ని తగ్గించుకుని ప్రేమించడం మొదలుపెడతారు.

పక్షపాతం లేకుండా..: పిల్లలు తప్పు చేసినప్పుడు వాడు చిన్న, పెద్ద ఎవరైనా సరే... పక్షపాతం చూపకుండా ఇద్దరినీ సమానంగానే క్రమశిక్షణలో పెట్టాలి. లేదంటే తానేదైనా చేస్తే అమ్మ కోప్పడుతుంది. అక్కో, చెల్లో చేస్తే ఏమీ అనడం లేదనే భావం వారిలో వచ్చేస్తుంది. దీంతో చిన్నవాళ్లపై ద్వేషం, అసూయ మొదలవుతాయి. ఈ పరిస్థితి రాకుండా పెద్దవాళ్లే జాగ్రత్తపడాలి. అలాగే ఇద్దరూ తమ బొమ్మలను కలిపి ఆడుకునేలా ప్రోత్సహించాలి. అది వారిలో పంచుకునే తత్వాన్ని నేర్పుతుంది.

వివక్ష వద్దు... చిన్నచిన్న పనులను ఇద్దరికీ సమానంగా చెప్పాలి. మగపిల్లాడు వాడు చేయడు, ఆడపిల్లవి నువ్వు చెయ్యి అంటూ లింగవివక్ష పిల్లల్లో చిన్నప్పటి నుంచి పెంచకూడదు. అలా చేస్తే పసి వయసు నుంచి ఆడపిల్ల అంటే తేలికైన భావం ఏర్పడుతుంది. అది మనసులో స్థిరపడుతుంది. ఆ లక్షణం బయటి వారిపై కూడా పిల్లలు ప్రదర్శిస్తారు. పని చేయడానికి ఆడమగ తేడా లేదనే అంశాన్ని చిన్నప్పటి నుంచే నేర్పాలి. అప్పుడే పిల్లలు సమానత్వం అంటే ఏంటో నేర్చుకుంటారు. వారికి చెప్పే కథలను కూడా తోబుట్టువులు కలిసి ఉండేలాంటివి అయితే వారికి అవి స్ఫూర్తినిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్