పిల్లల కోసం పంచ సూత్రాలు...

రమ్య తన తొమ్మిదేళ్ల కూతురికి చిన్న పని చెప్పినా నేను చేయలేనంటుంది. తనవల్ల పొరపాట్లు జరుగుతాయని భయపడుతుంది. పాప ప్రవర్తన చూస్తుంటే ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళనకు గురయ్యే రమ్యలాంటి వారికి మానసిక నిపుణులు కొన్ని పరిష్కారాలను సూచిస్తున్నారు....

Published : 28 Aug 2021 00:24 IST

రమ్య తన తొమ్మిదేళ్ల కూతురికి చిన్న పని చెప్పినా నేను చేయలేనంటుంది. తనవల్ల పొరపాట్లు జరుగుతాయని భయపడుతుంది. పాప ప్రవర్తన చూస్తుంటే ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళనకు గురయ్యే రమ్యలాంటి వారికి మానసిక నిపుణులు కొన్ని పరిష్కారాలను సూచిస్తున్నారు..

నమ్మకం..  చిన్నారులకు తమపై తమకు నమ్మకం కలిగేలా చేయాలి. చదువులో లేదా క్రీడల్లో అధైర్యంగా ఉన్నప్పుడు వాటిని వారే సొంతంగా చేసేలా చేయూతనివ్వాలి. మొదట విఫలం అయినా తిరిగి ప్రయత్నించేలా ప్రోత్సహించాలి. దాన్ని సాధించినప్పుడు ప్రశంసిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఆలోచన... చిన్నప్పటి నుంచి ఓ పుస్తకంలో తమ గురించి రాయడం నేర్పించాలి. తమ ఆలోచనలు గొప్పవనే భావం వారిలో కలిగేలా చేయాలి. ప్రతి ఆలోచనను తల్లిదండ్రులు గుర్తించి, వాటిని ఆ పుస్తకంలో పొందుపరచమని చెప్పాలి.

ప్రేమ... తనకన్నా పెద్దవారిని లేదా చిన్నవాళ్లను అమ్మ మరింత ఇష్టంగా చూస్తుంది అనే ఆలోచన వారి మనసులో రానివ్వకూడదు. సమానభావంతో పెద్దవాళ్లు పంచే ప్రేమ పిల్లల్లో అసూయ, ద్వేషాలను దూరం చేస్తుంది. ఇతరులపట్ల కూడా వారు ప్రేమ, దయతో ఉండేలా మారుస్తుంది.

వైఫల్యాలు... మంచి మార్కులు తెచ్చుకోలేక పోవడం, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నామనే భావన పిల్లలను కుంగదీస్తుంది. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవడం అలవరచాలి. ప్రయత్నిస్తే దేన్నైనా సాధించగలిగే ధైర్యాన్ని వైఫల్యం నేర్పుతుందని అనుభవపూర్వకంగా తెలుసుకునేలా చేయాలి.

తృప్తి... పిల్లల్లో అసంతృప్తి లేకుండా జాగ్రత్తపడాలి. తమకున్న దాంతో ఆనందంగా ఉండగలిగేలా శిక్షణనివ్వాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్