ఓ సారి క్షమించేయండి...

భార్యాభర్తలన్నాక అప్పుడప్పుడూ గిల్లికజ్జాలు... అలకలు సహజమే. అలాగని గొడవపడితే దాన్ని తెగేదాకా సాగదీయడం మంచిది కాదు. ఎదుటివారు క్షమించమని అడిగినప్పుడు అన్నీ మరిచిపోయి కలిసిపోవాలి. అంతే తప్ప అలిగి మేడ దిగనంటే ఎలా... ఎవరో ఒకరు సర్దుకుపోతేనే సంసారం చక్కగా ముందుకు సాగుతుంది.

Published : 30 Aug 2021 00:22 IST

భార్యాభర్తలన్నాక అప్పుడప్పుడూ గిల్లికజ్జాలు... అలకలు సహజమే. అలాగని గొడవపడితే దాన్ని తెగేదాకా సాగదీయడం మంచిది కాదు. ఎదుటివారు క్షమించమని అడిగినప్పుడు అన్నీ మరిచిపోయి కలిసిపోవాలి. అంతే తప్ప అలిగి మేడ దిగనంటే ఎలా... ఎవరో ఒకరు సర్దుకుపోతేనే సంసారం చక్కగా ముందుకు సాగుతుంది.

* వైవాహిక జీవితం సజావుగా సాగిపోవాలంటే భార్యభర్తలిద్దరూ సంతోషంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. సంసారంలో చిరు అలకలు పిల్లతెమ్మరల్లా ఉండేలా తప్ప ఈదురుగాలుల్లా మీ బంధంలో సునామీ సృష్టించకూడదు.

* క్షమించడం వల్ల జరిగిన పొరపాటు/తప్పు తీరిపోదు. అయితే భవిష్యత్తులో ఈ సమస్య పెద్దది కాకుండా ఉంటుంది. పొరపాటు ఎవరి వల్ల జరిగినా గతాన్ని మరిచిపోయి కలిసిపోవడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది.

* చేసిన తప్పిదానికి సారీ చెప్పిన భాగస్వామిని చిన్నచూపు చూడొద్దు. బదులుగా మీ ప్రేమనంతా తెలియజేయండి.  తప్పు చేసిన వారు కూడా క్షమాపణలు చెప్పి మీ పని అయిపోందని అనుకోకుండా దాని వెనక ఉన్న కారణాన్ని గుర్తు పెట్టుకోవాలి. మరోసారి భాగస్వామిని బాధపెట్టకుండా చూసుకోవాలి. ఆ బాధలో నుంచి వారిని త్వరగా బయటకు తీసుకురావాలి. అంతే తప్ప ఎదుటివారే మాట్లాడాలి. తనే సారీ చెప్పాలని మొండిగా ప్రవర్తించకూడదు.

* జరిగిపోయిన పొరపాటుకి పశ్చాత్తాపంగా సారీ చెప్పే బదులు  ప్రేమతో ఐ లవ్యూ చెప్పండి. ఎదుటివారు ఇట్టే కరిగిపోతారు. పొరపాట్లు అందరూ చేస్తారు. కొందరే వాటిని క్షమించగలుగుతారు. సరిదిద్దుకునే అవకాశం కల్పించడం కూడా ప్రేమేనని గుర్తిసే...ఆ బంధం కలకాలం పదిలంగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్