అనుబంధానికి... అద్దంలా మారండి

భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు స్నేహితులే. ఈ అనుబంధాన్ని మరింత బలంగా మార్చుకోవడానికి  ఇరువురూ కృషి చేయాలి. సంతోషాల్లోనే కాదు కష్టాల్లో మునిగి ఉన్నప్పుడు కూడా ఒకరికొకరు తోడుగా

Published : 13 Sep 2021 05:06 IST

భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు స్నేహితులే. ఈ అనుబంధాన్ని మరింత బలంగా మార్చుకోవడానికి  ఇరువురూ కృషి చేయాలి. సంతోషాల్లోనే కాదు కష్టాల్లో మునిగి ఉన్నప్పుడు కూడా ఒకరికొకరు తోడుగా ఉండేందుకు మానసికంగా ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి.  అందుకోసం ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయి.

బాధ్యతలు పంచుకోండి... ప్రతి పనికి భాగస్వామిదే బాధ్యతే అన్నట్లు కాకుండా కొన్ని పనులను మీరూ పంచుకోండి. ముందుగా చిన్న చిన్న పనులను తన నుంచి తీసుకుని వాటిని విజయవంతంగా పూర్తిచేయండి.

మాట్లాడండి... రోజులు గడిచే కొద్దీ భాగస్వామి దినచర్య మీకు తెలిసిపోతుంది. ఇది వారమంతా ఒకేలా ఉండొచ్చు. అయితే తను మీతో పంచుకునే విషయాలు ఎప్పటికప్పుడూ కొత్తవై ఉండాలి.,, కాబట్టి రోజులో కాసేపైనా ఇద్దరూ కలిసి మాట్లాడుకునేలా ప్రణాళిక వేసుకోండి. ఆ రోజు ఎలా గడిచిందో అడిగి తెలుసుకోండి. మీకు సరిగా అనిపిస్తే.. సలహాగా ఇవ్వండి.

రోజూ... కొత్తగా... వివాహబంధం ఎప్పుడూ నిత్యనూతనంగా ఉండేందుకు మీవంతు కృషి చేస్తూనే ఉండండి. ప్రతీ రోజునీనీ కొత్తగా ప్రారంభించండి. మీ మాటలతో, ఆత్మీయమైన స్పర్శతో భాగస్వామిపై మీకెంత ప్రేమ ఉందో తెలియజేయండి. అప్పుడే మీ బంధం మరింత దృఢంగా మారుతుంది.

ఒకరికొకరు అద్దంలా... మీ లక్ష్యాలను, అభిప్రాయాలను నిర్భయంగా చెప్పాలి. అలాగే అవతలి వ్యక్తి భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ప్రణాళికలను రాసుకోవాలి. ఇలా అన్ని విషయాల్లో ఒకరికొకరు తోడునీడగా ఉంటూ అచ్చమైన స్నేహితుల్లా ఉండాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్