బంధానికో ఫీడ్‌బ్యాక్‌

ఆఫీసులో పని విషయంలో బాస్‌ నుంచి అభినందనలూ, అవసరమైతే సూచనలూ సాధారణమే. దీన్నే ఫీడ్‌బ్యాక్‌గా చెబుతాం. దీని అంతిమ లక్ష్యం పని ఉత్తమంగా జరగడం. అలా జరిగితేనే.. రివార్డులు, పదోన్నతులు వగైరా.

Published : 20 Sep 2021 01:03 IST

ఆఫీసులో పని విషయంలో బాస్‌ నుంచి అభినందనలూ, అవసరమైతే సూచనలూ సాధారణమే. దీన్నే ఫీడ్‌బ్యాక్‌గా చెబుతాం. దీని అంతిమ లక్ష్యం పని ఉత్తమంగా జరగడం. అలా జరిగితేనే.. రివార్డులు, పదోన్నతులు వగైరా. ఈ విధానాన్నే వివాహ బంధంలోనూ ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. అదెలా ఉండాలంటే..

* ఫీడ్‌బ్యాక్‌ అనగానే సంస్థల మాదిరి 360 డిగ్రీల కోణంలో చూడొద్దు. అక్కడిలానే నియమ నిబంధనలు పెట్టి, తప్పనిసరిగా పాటించాలనొద్దు. ఇది ఇరువైపులా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే సలహాల్లా ఉండాలి.

* ఎదుటివారు ఫలానా విషయం నచ్చలేదని చెబితే సానుకూలంగా వినండి. వాళ్లు గమనించిన వాటిని చెప్పనీయండి. వాళ్లు అర్థం చేసుకున్న కోణం, పెరిగిన వాతావరణం వేరే అయ్యుండొచ్చు. దాన్ని మీ కోణంలో వివరించే ప్రయత్నం చేయండి. తప్పక అర్థం చేసుకుంటారు. నిజంగానే తప్పుందా.. మార్చుకునే ప్రయత్నం చేయండి.

* ఆలూమగలన్నాక ఒకరి నుంచి మరొకరు కొన్ని ఆశిస్తుంటారు. వాటిల్లో కొన్ని ఎదుటివాళ్లకు నచ్చకపోవచ్చు. కాబట్టి, తిరస్కరిస్తారు. దానికీ సిద్ధంగా ఉండాలి. నేను చెప్పినా వినట్లేదనో, అవమానంగానో భావించొద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్