ఓడిపోనివ్వండి...

రమ్య తన ఎనిమిదేళ్ల కొడుకును నెగ్గించడానికి ఏ ఆట ఆడినా తాను ఓడిపోతూ ఉంటుంది. లేదంటే వాడు బాధపడతాడనుకుంటుంది. ఇది తప్పని, పిల్లలు చిన్నప్పటి నుంచి ఓటమిని రుచిచూస్తేనే గెలుపువైపు అడుగులేస్తారని చెబుతున్నారు మానసిక నిపుణులు.

Updated : 29 Sep 2021 05:18 IST

రమ్య తన ఎనిమిదేళ్ల కొడుకును నెగ్గించడానికి ఏ ఆట ఆడినా తాను ఓడిపోతూ ఉంటుంది. లేదంటే వాడు బాధపడతాడనుకుంటుంది. ఇది తప్పని, పిల్లలు చిన్నప్పటి నుంచి ఓటమిని రుచిచూస్తేనే గెలుపువైపు అడుగులేస్తారని చెబుతున్నారు మానసిక నిపుణులు. గెలుపోటములను సమన్వయం చేయగలిగేలా పిల్లలనెలా పెంచాలో సూచిస్తున్నారు.

సానుభూతి... పిల్లలకు ఆటల్లో ఓటమి, చదువులో వెనుకబడటం వంటి సందర్భాలెదురైనప్పుడు వెంటనే మరోసారి ప్రయత్నించి గెలవొచ్చు అని చెప్పడం కన్నా ముందుగా వారిపట్ల కొంత సానుభూతిని కూడా ప్రదర్శించాలి. చిన్నారుల ఆలోచనలను మరలించడానికి ఇది అవసరం. అప్పుడే తిరిగి పుంజుకోగలరు.

స్ఫూర్తి... తల్లిదండ్రులు బాల్యంలో తమకు ఎదురైన కష్టాలు, పొందిన పరాజయాలు, అనుభవాల గురించి పిల్లలకు చెబుతూ ఉండాలి. వాటిని ఎలా ఎదుర్కొని ముందడుగు వేసి, విజయం సాధించారో వివరించాలి. అప్పుడు మిమ్మల్నే స్ఫూర్తిగా తీసుకుంటారు.

నైపుణ్యం... చిన్నారులు ఓడిపోతే ఏడుస్తారనే ఆలోచనను పక్కన పెట్టాలి. విజేతగా నిలబడక పోయినా ఫర్వాలేదు...కానీ ఓటమిని అంగీకరించడం అలవాటు చేయాలి. లేదంటే ఓటమిని తట్టుకోలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. బయటపడలేక అనాలోచిత నిర్ణయాలు తీసుకునే ప్రమాదమూ ఉంది. ‘ఓడిపోవడం కూడా మంచిదే, అందులోంచి కారణాలను గుర్తించి మరింత నైపుణ్యం పెంచుకోవచ్చు’ అనే సానుకూల ధోరణిని అలవరిస్తే వారు మానసికంగా దృఢంగా ఉంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్