అప్పుడెలా ఉన్నావు.. ఇప్పుడెలా మారావు!

చాలామంది దంపతులు ఇలా.. ‘ఒకప్పటిలా లేవు, మారిపోయావు’ అంటూ గొడవలు పడుతుండటం చూస్తుంటాం. ఒక్కోసారి తీవ్రస్థాయికీ వెళుతుంటాయి కూడా. కానీ ఇది సాధారణమంటున్నారు

Updated : 30 Sep 2021 02:04 IST

చాలామంది దంపతులు ఇలా.. ‘ఒకప్పటిలా లేవు, మారిపోయావు’ అంటూ గొడవలు పడుతుండటం చూస్తుంటాం. ఒక్కోసారి తీవ్రస్థాయికీ వెళుతుంటాయి కూడా. కానీ ఇది సాధారణమంటున్నారు నిపుణులు. మార్గాన్నీ సూచిస్తున్నారు!

నిషి జీవితంలో ఒక్కో దశలో ఒక్కో రకమైన మార్పూ ఉంటుంది. బంధం కూడా అంతే! దీన్నీ అర్థం చేసుకుంటేనే ఆనందం. కొత్త దాంపత్యంలో ఒకరితో ఒకరు గడిపే సమయం ఎక్కువ. ఎన్నో సరదాలతో ఆనందంగా సాగిపోతుంది. జీవితాంతం అలానే సాగిపోతుందని అనుకున్నప్పుడే సమస్యలు. దీన్నోసారి జాగ్రత్తగా పరిశీలించండి. పెళ్లి అనగానే సహజంగానే సెలవులు, పైవాళ్లూ కొంత అర్థం చేసుకోవడం వెరసి సమయం దొరుకుతుంది. దాంతో భాగస్వామికి కేటాయిస్తారు. ఆఫీసులో కొత్త ప్రాజెక్టులు.. కొత్త బాధ్యతలు ఇలా తోడయ్యే కొద్దీ అంతలా సమయం కేటాయించడం కుదరదు.

ఒక్కోసారి చెప్పకుండానే అర్థం చేసుకుంటారనే నమ్మకం ఏర్పడుతుంది. దాని వల్లా ప్రతీది చెప్పకపోవచ్చు. అర్థం చేసుకోవాలి. లేదంటే పరిస్థితి ఇదని వివరంగా చెప్పాలి. పోనుపోనూ చెప్పాల్సిన అవసరమే రాకపోవచ్చు. దానికి అలవాటు చేయాల్సిన బాధ్యత మాత్రం మీదే! ఉద్యోగమైనా, పిల్లలైనా భాగస్వామి పరిస్థితిని ఇద్దరూ అర్థం చేసుకోవాలి. అవసరమైతే ఇద్దరి కోసం సమయం కేటాయించుకునేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఒకరికొకరు సాయం చేసుకోవాలి. అప్పుడే సమయం తగ్గినా ప్రేమ పెరుగుతుంది. బంధం బలపడుతుంది. అంతేకానీ సమయం కుదరట్లేదనో, అప్పటిలా ఉండట్లేదనో దెప్పి పొడుపులు, తగాదాలు పెట్టుకుంటూ పోతే.. దూరం పెరుగుతుందే కానీ తగ్గదని గమనించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్