ప్రియమైన నేస్తమా

వివాహం ఓ అందమైన బంధం. జీవిత భాగస్వామి ఓ మంచి స్నేహితుడైతే... ఆ అది మరింత దృఢమవుతుంది. లేదా మీరే పార్ట్‌నర్‌కు ప్రాణనేస్తంలా మారండి. అందుకేం చేయాలంటే....

Updated : 03 Oct 2021 01:53 IST

వివాహం ఓ అందమైన బంధం. జీవిత భాగస్వామి ఓ మంచి స్నేహితుడైతే... ఆ అది మరింత దృఢమవుతుంది. లేదా మీరే పార్ట్‌నర్‌కు ప్రాణనేస్తంలా మారండి. అందుకేం చేయాలంటే....

* భాగస్వామి గురించి ప్రతి విషయాన్నీ తెలుసుకోండి. అన్నీ తెలుసని అనుకున్నా ఏదో ఒకటి మిగిలే ఉంటుంది. కాబట్టి తన గతం... దానివల్ల కలిగిన ఆనందాలు, ఆవేదనలు అన్నీ తెలుసుకోండి. అన్ని పనులూ తనే చూసుకుంటుంటే మీకు చేతనైనవి మీరు చేయండి. దీని వల్ల తనకు కాస్త పని ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఏమైనా పొరపాటు జరిగితే క్షమాపణలు చెప్పడానికి వెనకాడొద్దు.

* మీ అనుబంధం నిత్యనూతనంగా ఉండేలా చూసుకోండి. ఇద్దరూ రోజులో కాసేపు కలిసి గడిపేలా ప్రణాళిక వేసుకోవాలి. ఆ సమయంలో సంతోషాలను షేర్‌ చేసుకోండి. మీ ప్రేమను రోజూ కొత్తగా, వైవిధ్యంగా భాగస్వామికి తెలియ జేయండి. తనతో మీరు గడిపే ప్రతీ క్షణం మధుర జ్ఞాపకంలా ఉండాలి. దొరికిన అమూల్యమైన సమయాన్ని ఆనందాల పోగు చేసుకోడానికి వాడుకోండి. ఆనందాల్లోనే కాదు... కష్టాల్లోనూ కంటి పాపలా తోడుండాలి... చేయూతనివ్వాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్