కాపురం కొత్తగా మారాలంటే...

నూరేళ్లు కలిసుండాలనే ఆలోచనతో కాపురం మొదలెట్టిన భార్యాభర్తల్లో చాలామంది...చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోలేక విడాకులే పరిష్కారం అనుకుంటారు. అసలెందుకీ సమస్య?

Updated : 17 Oct 2021 06:53 IST

నూరేళ్లు కలిసుండాలనే ఆలోచనతో కాపురం మొదలెట్టిన భార్యాభర్తల్లో చాలామంది...చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోలేక విడాకులే పరిష్కారం అనుకుంటారు. అసలెందుకీ సమస్య?

* ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కానీ ఇల్లు గడవని పరిస్థితి. బాధ్యతల్ని సమన్వయం చేసుకునే క్రమంలో కాస్త ఒత్తిడికి గురవడం కూడా సహజమే. ఇలా రోజులు గడిచే కొద్దీ ఒకరికోసం ఒకరు ఆలోచించే సమయం తగ్గి... ఇద్దరి జీవితాల్లో అభద్రత, అసహనం చోటు చేసుకుంటాయి. అప్పుడు ‘నాపై ప్రేమ తగ్గిపోయింది’ అని ఒకరు. ‘నాకోసం ఏం చేయట్లేదు’ అని మరొకరు వాదులాడుకోవడం మొదలుపెడతారు. ఆ పరిస్థితి మీ ఇద్దరి మధ్యా రాకూడదంటే ఇంటి పనులన్నీ పంచుకోవాలి. ఒకరి ఇబ్బందులు మరొకరు అర్థం చేసుకుని సాయపడాలి. అప్పుడే వారిలో అభద్రత తగ్గుతుంది.

ఇద్దరి గురించీ ఒకరికొకరికి పూర్తిగా తెలిసిపోయాక...లోపాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒకరినొకరు ఆకర్షించుకోవడం మానేసి ఎత్తి చూపిస్తారు. అలాకాకూడదంటే వీలు చిక్కినప్పుడు ఏకాంతంగా గడపడానికి ఎక్కడికైనా టూర్‌ వేయడం మరిచిపోవద్దు. ఇలా మీకోసం మీరు గడిపే సమయం ప్రేమను పెంచుతుంది.

* చాలామంది దంపతుల మధ్య గొడవలకు కారణం అహం. దాన్ని మధ్యలోకి రానివ్వొద్దు. సమస్య వచ్చినప్పుడు పంతానికి పోకుండా ఆ క్షణం మౌనంగా ఉండండి చాలు. పరిస్థితులు అవే సర్దుకుంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్