ఒక్క సంతానమే అయితే!

అంజలి తన బొమ్మలను ఎవరితోనూ పంచుకోదు. స్కూల్‌లోనూ ముభావంగా ఉంటుంది. ఇలా ఒంటరిగా పెరిగే పిల్లల ప్రవర్తనలో మార్పు తేవాల్సిన ఆవశ్యకత ఉందంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే...

Updated : 17 Oct 2021 07:09 IST

అంజలి తన బొమ్మలను ఎవరితోనూ పంచుకోదు. స్కూల్‌లోనూ ముభావంగా ఉంటుంది. ఇలా ఒంటరిగా పెరిగే పిల్లల ప్రవర్తనలో మార్పు తేవాల్సిన ఆవశ్యకత ఉందంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే...

ఇంట్లో ఒకే సంతానం గారాబంగా పెరుగుతారు. బొమ్మలు, వస్తువులను ఒక్కరే వినియోగించు కుంటారు. వేరెవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. దీనికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. లేదంటే ఈ ఒంటరితనం చిన్నారి భవిష్యత్తుకి ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. దీన్ని అధిగమించేందుకు తోటి పిల్లలతో స్నేహం చేయడం, కలిసి ఆడుకోవడం, బొమ్మలను పంచుకోవడం వంటివి అలవాటు చేయాలి.

ఆధారపడటం....

తమకు లేకలేక కలిగిన సంతానమంటూ... ఆ చిన్నారికి కావాల్సినవన్నీ ముందుగానే అమర్చిపెట్టడం, వారి పనులను కూడా పూర్తిచేయడం వంటివి తల్లిదండ్రులు చేస్తుంటారు. కనీసం పిల్లలకు తమ పని చేసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వరు. దాంతో వారు ప్రతి చిన్న అవసరానికీ  అమ్మానాన్నలపై ఆధారపడతారు. ఫలితంగా భవిష్యత్తులో ముఖ్యమైన  నిర్ణయాలు తీసుకోవడానికీ భయపడతారు. అలాకాకుండా చిన్నప్పటి నుంచి పిల్లల అభిరుచులు, ఆలోచనలను అడిగి తెలుసుకోవాలి. వారి పనులను వారే పూర్తి చేసుకునేలా ప్రోత్సహించండి. అప్పుడే ఉన్నతంగా ఎదగగలరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్