కోప్పడొద్దు!

పిల్లలు ఎదిగే తీరు, ఆలోచనా విధానం వంటివన్నీ ఇంటి వాతావరణంపై  ఆధారపడతాయి. ముఖ్యం పెద్దల కోపం... వారిపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తుందంటున్నారు మానసిక వైద్యులు. అలాకాకూడదంటే...

Published : 18 Oct 2021 00:58 IST

పిల్లలు ఎదిగే తీరు, ఆలోచనా విధానం వంటివన్నీ ఇంటి వాతావరణంపై  ఆధారపడతాయి. ముఖ్యం పెద్దల కోపం... వారిపై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తుందంటున్నారు మానసిక వైద్యులు. అలాకాకూడదంటే...

* నిశ్శబ్దంగా... అల్లరి, నచ్చని పనులు చేయడం వంటివి పెద్దల కోపానికి కారణమవుతాయి. పిల్లల్ని నియంత్రించలేనప్పుడు వారిపై చేయి చేసుకోవడం, దూషించడం చేస్తారు. కొందరు చిన్నారుల్లో ఇది తీవ్ర ఆత్మనూన్యతకు దారితీస్తే, మరికొందరిని మొండికేసేలా చేస్తుంది. ఇలాంటి ప్రతికూల ప్రభావం వారిపై పడకూడదంటే కాసేపు మీరు మౌనంగా ఉండటమే మేలు.

* వాదనొద్దు... కొందరు తల్లిదండ్రులు పిల్లల మీద అరవడమే కాదు. వారి ప్రవర్తనకు ‘నువ్వంటే నువ్వే కారణం’ అంటూ ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. ఒకరికి తెలియకుండా మరొకరు గారాబం చేయడం లేదా అతిగా నియంత్రించడం చేస్తారు. ఫలితంగా ఇటువంటి వాతావరణంలో పెరిగే పిల్లలు కూడా అదే తీరుని అలవరుచుకుంటారు. భావోద్వేగాల్ని నియంత్రించుకోలేరు. కొన్నిసార్లు పెద్దవాళ్లపై ఎదురు తిరగడం, లేదా తమను తామే హింసించుకోవడం వంటివీ చేసే ప్రమాదముంది. బిడ్డల విషయంలో ముందు తమ తీరుని మార్చుకోవడం తల్లిదండ్రులకు ఎంతైనా అవసరం.

* నియంత్రించుకోండిలా... ప్రతి మనిషిలోనూ భావోద్వేగాలు సహజం. కాకపోతే అవి మన మనసు చెప్పినట్లు వినాలి. లేదంటే తప్పనిసరిగా వాటిని నియంత్రించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి ఆచరించాలి. అలా జరగకపోతే...తీవ్ర అనారోగ్యాలకు దారి తీయడమే కాదు...మీ పిల్లలూ దారి తప్పేలా చేస్తుంది. అందుకే మీరు కోపాన్ని అదుపు చేసుకుంటే...దాన్నే వారూ అనుసరిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్