బంధంలో నా..నీలు వద్దు
close
Updated : 29/10/2021 06:13 IST

బంధంలో నా..నీలు వద్దు

వైవాహిక బంధంతో ముడిపడిన జీవితాలు ఒకరికొకరుగా నూరేళ్లు అన్నట్లు ఉండాలి. కానీ దాన్ని గుర్తించకుండా చిన్న చిన్న విషయాలకే చిర్రు బుర్రు లాడుతుంటారు. కారణాలేవైనా మనస్పర్థలు వస్తుంటే... మీ పద్ధతిలో కొన్ని మార్పులు చేసుకోవడం తప్పనిసరి.

* ఆలుమగలుగా... ఇద్దరి ప్రయాణం ఒకటే. అలాంటప్పుడు నా, నీ అని కాక మేమిద్దరం, మా అనే భావనతో నడవాలి. అప్పుడే చిన్న చిన్న ఇబ్బందులను పట్టించుకోకుండా ముందడుగు వేయగలరు. అంతేకాదు... ఈ క్రమంలో ఒకరు వెనకబడినా... మరొకరు వెన్ను తట్టి నడిపించగలరు.

* కలతలు వస్తోంటే... ఎదుటివారిలో లోపాలను ఎత్తిచూపే అలవాటుని మానుకోండి. వీలైతే వారిలో సానుకూల అంశాలను నెమరు వేసుకోండి. ఓ చిన్న ప్రశంస, ప్రేమగా మాట్లాడటం వంటివి ఎదుటి వారిలో తప్పక మార్పు తెస్తాయి.

* పొరబాట్లు సహజం... అవి ఇద్దరిలో ఎవరివల్లైనా జరగొచ్చు. సమస్యను మీ వైపే కాకుండా ఎదుటివారి కోణం నుంచీ కూడా  ఆలోచించడానికి ప్రయత్నించండి. ఇలాంటప్పుడే అహం అడ్డొస్తుంది. సమస్యను జఠిలం చేస్తుంది. ఇబ్బంది ఎదురైన ప్రతిసారీ గతాన్ని తవ్వి పెద్దది చేసుకునే పద్ధతి వదిలెయ్యండి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం లేదు. అలాంటి పరిస్థితి మీ భాగస్వామిలో కనిపిస్తే కచ్చితంగా మంచి మనసుతో అంగీకరించండి. అయితే ఒకరితో ఒకరు ఎంత స్వచ్ఛంగా ఉండగలుగుతున్నారు అన్నదే ఆ బంధం బలంగా మారేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని