వారికో ఛాయిస్‌ ఇవ్వండి

ప్రతి తల్లిదండ్రులకీ బిడ్డలపై ప్రేమ ఉంటుంది. కొందరు అసలు తమ పిల్లలకు కష్టమే తెలియకుండా పెంచాలనుకుంటారు. ఇంకొందరు వారు అడగకుండానే అన్ని అవసరాలూ తీర్చేస్తుంటారు. ఈ రెండూ

Updated : 03 Nov 2021 06:09 IST

ప్రతి తల్లిదండ్రులకీ బిడ్డలపై ప్రేమ ఉంటుంది. కొందరు అసలు తమ పిల్లలకు కష్టమే తెలియకుండా పెంచాలనుకుంటారు. ఇంకొందరు వారు అడగకుండానే అన్ని అవసరాలూ తీర్చేస్తుంటారు. ఈ రెండూ వారికి లోకజ్ఞానం తెలియనివ్వవు. నిర్ణయాల్లోనూ ఇతరులపై ఆధారపడే పరిస్థితి తెచ్చుకుంటారు. అలాకాకూడదంటే...

పెద్దలు ఎప్పుడూ....చిన్నారుల భవిష్యత్తు బాగుండాలని కోరుకోవాలి. అంటే కష్టనష్టాలకు వెరవకుండా...నిలబడగలిగే వ్యక్తిత్వాన్ని వారికి అలవాటు చేయాలి. భావోద్వేగాలను అదుపు చేసుకోవడం నేర్పాలి.

* పిల్లల ఇష్టాయిష్టాలను అర్థం చేసుకోవాలి. అలాగని వారు కోరిందల్లా సులువుగా అందుతుంటే...శ్రమించే అలవాటుని తగ్గించుకుంటారు. క్రమంగా ఏది సంపాదించాలన్నా సులువైన దారులను వెతుక్కుంటారు. అది వారి జీవన శైలినీ, జీవితాన్నీ కూడా ప్రభావితం చేయొచ్చు. అందుకే అవసరానికి మించి పిల్లలు ఏది కోరుకున్నా...చిన్న టాస్క్‌లు ఇచ్చి పూర్తిచేస్తేనే అని చెప్పండి. ఇది వారిలో స్వయంకృషిని అలవాటు చేస్తుంది.

* పెద్దల అలవాట్లు, ఆలోచనలే పిల్లలపైనా ప్రభావం చూపిస్తాయి. అందుకే మీరు ముందు క్రమశిక్షణను, నీతి నిజాయతీలను అలవరుచుకోండి. ఆడంబరంగా మాట్లాడటం, ఎదుటివారిని కించపరచడం వంటివేవీ చేయొద్దు. మీ బిడ్డలు అలా చేస్తుంటే...కచ్చితంగా ఆ తీరుకి మొదటే అడ్డుకట్ట వేయండి. అప్పుడే నిరాడంబరత్వం వారికి అలవడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్