కాదు.. లేదు.. అనడం తెలుసా?

ఏ విషయంలోనైనా ఎవరో వచ్చి మనల్ని ఆదుకుంటారని ఆశించడం మానేసి మనమే ధైర్యంగా, చొరవగా ముందడుగు వేయాలి. అప్పుడే అభివృద్ధి, ఆత్మతృప్తి కూడా. మనకు మనమే ఎలా సాయం చేసుకోగలం, ఆలంబనగా ఎలా నిలబడగలం అనితికమకపడనవసరం లేదు. మానసిక నిపుణులు చేస్తున్న ఈ మార్గనిర్దేశాలను  చూడండి...

Published : 17 Nov 2021 01:59 IST

ఏ విషయంలోనైనా ఎవరో వచ్చి మనల్ని ఆదుకుంటారని ఆశించడం మానేసి మనమే ధైర్యంగా, చొరవగా ముందడుగు వేయాలి. అప్పుడే అభివృద్ధి, ఆత్మతృప్తి కూడా. మనకు మనమే ఎలా సాయం చేసుకోగలం, ఆలంబనగా ఎలా నిలబడగలం అనితికమకపడనవసరం లేదు. మానసిక నిపుణులు చేస్తున్న ఈ మార్గనిర్దేశాలను  చూడండి...

ఇంటిల్లిపాది గురించీ తపించే ఇల్లాలు తన గురించి తాను పెద్దగా పట్టించుకోదు. అది అలసటకూ ఆందోళనకూ గురిచేస్తుంది, దాంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. అందువల్ల తన గురించి తాను శ్రద్ధ తీసుకోవాలి. అది అవసరమే తప్ప స్వార్థం కాదని గుర్తుంచుకోవాలి.

మన మీద మనకు అమిత ప్రేమ ఉండాలి. బంధుమిత్రులు ఎందరున్నా మనకు తొలి నేస్తం మనమేనని మర్చిపోకూడదు. కొన్ని అంశాల గురించి ఇతరులు హేళన చేస్తారేమో అనిపించినప్పుడు అంతరంగంలో చర్చించుకోండి. పరిష్కారం దొరుకుతుంది. మనసు నెమ్మదిస్తుంది. ఒక పని చేయాలా వద్దా అనే సందేహం కలిగినప్పుడు లాభ, నష్టాలు రెండూ రాసి ఏది మెరుగో తేల్చుకోండి.

అస్తమానం పనులూ బాధ్యతలే కాదు, కొంత సమయం మీకోసం కేటాయించుకోండి. కాసేపు ఒంటరిగా గడపండి. ఇష్టమైన వ్యాపకం కల్పించుకోండి. పాటలు వినడమో, ఇష్టమైన కార్యక్రమం చూడటమో, పుస్తకాలు చదవడమో చేయండి. ఊరటనిస్తుంది.

అన్నీ మీరే చేయాలనుకోవద్దు. ఇతర కుటుంబ సభ్యులకూ కొన్ని పంచండి. దీనివల్ల మీకు పనిభారం తగ్గడమే కాదు, అందులో ఉన్న కష్టనష్టాలేంటో, ఇన్నాళ్లూ వాటినెంత చాకచక్యంగా చేశారో వాళ్లకూ అర్థమై మీపై గౌరవభావం పెరుగుతుంది.

ఎవరేది చెప్పినా చేసేయడం ధర్మం అనుకోవద్దు. ఒక్కోసారి కాదు, లేదు అని చెప్పడం కూడా న్యాయమేనని అవగాహన చేసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్