పిల్లలతో జట్టు...భాషపై పట్టు

హర్షిత స్నేహితులందరూ ఇంగ్లిషు, హిందీల్లో మాట్లాడుతోంటే.. పూర్తిగా అర్థంకాక ఇబ్బంది పడుతుంటుంది. ఇలా ఎక్కువ కాలం సాగితే న్యూనత వచ్చేస్తుంది.

Updated : 25 Nov 2021 05:47 IST

హర్షిత స్నేహితులందరూ ఇంగ్లిషు, హిందీల్లో మాట్లాడుతోంటే.. పూర్తిగా అర్థంకాక ఇబ్బంది పడుతుంటుంది. ఇలా ఎక్కువ కాలం సాగితే న్యూనత వచ్చేస్తుంది. అందుకే తనకు ఆ భాషలపై పట్టుతేవాలని ప్రయత్నిస్తోంది వాళ్ల అమ్మ. పిల్లలతో జట్టుకడితే వాళ్లకే కాదు మీకూ వేరే భాష వచ్చేస్తుందంటున్నారు నిపుణులు. ఇంకా ఏమంటున్నారంటే...

భాష తెలియకపోతే పిల్లలు పాఠ్యాంశాలు అర్థంకాక ఇబ్బంది పడతారు. అలాగని బెదిరిస్తే ఇంకా భయపడిపోతారు. కాబట్టి, ముందు ఆసక్తి చూపేలా ప్రోత్సహించాలి. ఇప్పుడు ఆన్‌లైన్‌ అవకాశాలూ బోలెడు. వాటిని వినియోగించుకుంటే సరి. అవసరమైతే పిల్లలతోపాటు పెద్దవాళ్లూ చేరాలి. అప్పుడే చిన్నారులకూ ఆసక్తి పెరుగుతుంది. త్వరగానూ నేర్చుకోవచ్చు. ఆ భాషల్లోనే మాట్లాడే ప్రయత్నం చేయమనాలి. తప్పులు దొర్లినా ఫర్లేదని వెన్ను తట్టాలి.

* చదవడం.. నేర్చుకుంటున్న భాషలో కథలు, చరిత్ర పుస్తకాలు చదవమనండి. తెలియని పదాలను ఒకచోట రాసి వాటి అర్థం తెలుసుకోమనండి, వాళ్లతో వాటిపై చర్చిస్తే భాషపై పట్టు వస్తుంది. మొదట్లో కొంత ఇబ్బందైనా.. క్రమేపీ అలవాటు అవుతుంది.

* టీవీలో.. పిల్లలు కార్టూన్లు, సాహస కథల కార్యక్రమాలను ఇష్టంగా చూస్తారు. వారికి నచ్చినవాటినీ వాళ్లు నేర్చుకోవాలనే భాషలోనే చూపిస్తే సరి. ఆ పాత్రలు వాడే పదాలు పిల్లల మనసులో నిక్షిప్తమవుతాయి. ఫలితంగా ఎన్నో పదాలూ తెలుస్తాయి. వాక్య నిర్మాణమూ తెలుస్తుంది. నెమ్మదిగా మాట్లాడటమూ మొదలుపెడతారు.

* రాయడం.. ఆలోచనలు, ఆ రోజు చేసిన పనులను ఓ పుస్తకంలో రాయమనాలి. కొత్తగా నేర్చుకుంటున్న భాషలో ప్రయత్నించమనండి. పదాల వినియోగం తెలుస్తుంది. ఆయా భాషల్లో పాటలు వినడమూ చాలా మంచి మార్గమే. ఇంట్లో కూడా ఆ భాషల్లో రోజులో కొద్దిసేపు మాట్లాడాలని నియమం పెడితే సరి. పట్టు చిక్కేకొద్దీ పిల్లలకు ఉత్సాహం పెరుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్