శ్రద్ధ చూపాల్సింది మీరే
close
Updated : 30/11/2021 06:17 IST

శ్రద్ధ చూపాల్సింది మీరే!

భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ప్రతి భార్యా కోరుకుంటుంది. సమయానికి అన్నీ సమకూర్చడం, చక్కగా వండి పెట్టడం వంటివన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. అయినా పెరుగుతున్న వయసు, కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు అనారోగ్యానికి దారి తీయొచ్చు. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరి.

టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, ఏ ఆటైనా ఇద్దరూ కలిసి రోజూ కొద్దిసేపు ఆడండి. ఇది మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువూ నియంత్రణలో ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరిగి జబ్బులు దరి చేరవు. బంధమూ కొత్త మలుపు తీసుకుంటుంది. తీపి పదార్థాలకు బదులుగా పండ్లను అలవాటు చేయండి. చక్కెర స్థానంలో బెల్లం, తేనె, బ్రౌన్‌ షుగర్‌ ఉపయోగించండి.

రోజువారీ ఆహారంలో విటమిన్‌ ఎ, బి12, సి, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే పదార్థాలను తీసుకునేలా చూడండి. ఇవి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. డ్రైఫ్రూట్స్‌, తాజా ఆకుకూరలు, పండ్లు, పండ్లరసాలు, సూప్‌లకు ఎక్కువ ప్రాధాన్యమివ్వండి.

ఏడాదికోసారి పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. శ్రీవారికి రాత్రిళ్లు చాలా ఆలస్యంగా నిద్రపోవడం అలవాటా? వచ్చే ఆరోగ్య సమస్యలను వివరించండి. వీలైనంత వరకు ఇంట్లో చేసిన ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వండి. జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండేలా చూడండి. చాలామంది మగవాళ్లు నీళ్లు సరిగా తాగరు. మీవారూ ఆ కోవకే చెందితే రోజులో రెండు మూడు లీటర్ల నీరు తాగేలా గుర్తు చేయండి. ఆ.. ఇదంతా ఓ వయసు వచ్చాక అనుకోకండి. కొత్త దంపతులైనా వీటిని అలవాటు చేసుకోవాల్సిందే, పాటించాల్సిందే. అప్పుడే బంధం ఆరోగ్యంగా సాగగలుగుతుంది.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని