ఈ తరహా స్నేహాలు వద్దు...
close
Updated : 01/12/2021 05:36 IST

ఈ తరహా స్నేహాలు వద్దు...

జీవితంలో ఎదురయ్యే సమస్యలకు చాలాసార్లు స్నేహితులిచ్చే చేయూతే పరిష్కారాన్ని చూపిస్తుంది. స్నేహం పేరుతో మన పతనాన్ని కోరుకునే వాళ్లకీ కొదవ లేదు. ఇలాంటి వాళ్లకి మాత్రం దూరంగా ఉండాలి. మరి వారిని గుర్తించడమెలా అంటారా? ఇదిగో ఇలా!

దైనా కష్టమైన, ఛాలెంజింగ్‌గా ఉండే పనుల్ని పూర్తిచేసినప్పుడు నిజమైన స్నేహితులు అభినందిస్తారు. అలాకాకుండా వారిలో అసూయ కనిపిస్తే మాత్రం ఆ స్నేహాన్ని నమ్మొద్దు. మీ అభివృద్ధిని కోరుకోలేని వారు మిత్రులు కాలేరు.

* మీ జీవిత లక్ష్యాలు, కలలను నిజమైన స్నేహితులైతే ప్రోత్సహిస్తారు. వీలైతే సాయం చేయడానికీ ముందుకొస్తారు. నిరుత్సాహపరుస్తూ, ఇది నీవల్ల కాదంటూ వెనకడుగు వేసేలా చేస్తే మాత్రం హితులు కానట్లే. వీళ్లకి దూరంగా ఉండాలి.

* సాయం అవసరమైనప్పుడు మొహం చాటేసి, సాధించినపుడు పక్కన చేరేవాళ్ల వల్ల ఉపయోగమేమీ ఉండదు. మీకోసం సమయాన్ని వెచ్చించకుండా, వారికి అవసరమైనప్పుడు మాత్రం మీ చేయూత కోసం చూసే వారినీ నమ్మొద్దు.

* స్నేహితులంటే.. మీరు చెప్పిన ప్రతి దానికీ ఊ కొట్టనక్కర్లేదు. కానీ కనీసం చెప్పేది వినాలి కదా! దీనికితోడు నలుగురిలో ఎప్పుడూ విమర్శిస్తున్నా, వెనుక చెడుగా మాట్లాడుతున్నా.. అలాంటివాళ్లని దూరం పెట్టడంలో తప్పులేదు. ఇతరులతో అమర్యాదగా ప్రవర్తించే వారి స్నేహమూ వద్దు. ఆ చెడ్డపేరు మీకూ వస్తుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని