కబుర్లు, కథలు చెబుతున్నారా?
close
Updated : 02/12/2021 06:13 IST

కబుర్లు, కథలు చెబుతున్నారా?

అనగనగనగా.. ఒకప్పుడు పిల్లలకి తినిపించాలన్నా, నిద్ర పుచ్చాలన్నా, అలక తీర్చాలన్నా అమ్మలు బయటకు తీసే అస్త్రమిదే. ఇంకా.. అమ్మమ్మ, తాతయ్యలుంటే వాళ్లతో బోలెడు కబుర్లు చెప్పేస్తుంటారు. ఇవన్నీ ఒకప్పటివని తీసి పారేయకండి. వాళ్ల మానసిక పరిణతిపై ప్రభావం చూపే గొప్ప మార్గాలంటున్నారు నిపుణులు. కాబట్టి..

చిన్నారుల్ని ఆదర్శంగా తీర్దిదిద్దాలంటే వాళ్లకి ఊహ తెలిసినప్పటి నుంచే చక్కటి నీతి కథలు చెబుతుండాలి. అవి ఆలోచింప జేయడంతోపాటు ఆచరించాలన్న ప్రేరణనూ కలిగిస్తాయి.

 స్కూల్లో ఎవరు నీ స్నేహితులు? ఏ టీచర్‌ అంటే ఇష్టం? ఎందుకిష్టం? ఫలానా కథ/ సినిమా ఎందుకు నచ్చింది- ఇలా సిసింద్రీల ఆసక్తులు, అభిరుచుల గురించిన ప్రశ్నలు అడగాలి. ఇది వాళ్లలో ఉత్సాహాన్ని నింపడంతోపాటు లోతుగా ఆలోచించే తీరును అలవాటు చేస్తుంది.

 కొత్త విషయాలను విన్నప్పుడు చిన్ని బుర్రల్లో సందేహాలు సహజమే! అలాంటప్పుడు విసుక్కోకుండా జవాబులు చెప్పండి. అప్పుడే వాళ్ల ఊహాశక్తి విస్తృతమవుతుంది. ప్రశ్నించే తీరూ అలవాటవుతుంది. పిల్లలకు ఊహాశక్తి ఎక్కువ. వాళ్లు చంద్రమండలంలో స్కిప్పింగ్‌ ఆడగలరు, పాతాళంలో హెలికాఫ్టర్‌ నడపగలరు. మీతో పంచుకుంటోంటే వినండి. చిన్నచూపు చూడకండి. దేన్నైనా పంచుకునే మనస్తత్వం అలవాటయ్యేది ఇక్కడే.

  పిల్లల ముందు బంధుమిత్రులను విమర్శించడం, చులకన చేయడం వద్దు. వాళ్లూ అదే తీరు అలవాటు చేసుకుంటారు. చిన్న చిన్న సమస్యలు చెప్పి.. నువ్వు అయితే ఏం చేస్తావని అడగండి. వాళ్ల మేధస్సు, ఆలోచనా పరిధి పెరుగుతాయి.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని