బంధం భద్రంగా
close
Published : 06/12/2021 01:24 IST

బంధం భద్రంగా

జీవితభాగస్వామిని నొప్పించకుండా మనసులోని మాటను మృదువుగా చెప్పగలగాలి. అప్పుడే ఆ బంధం ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగుతుంది. అందుకు సూచనలిస్తున్నారు మానసిక నిపుణులు.

ఆరోగ్యకరం.. దంపతుల మధ్య చర్చలు, వాదోపవాదాలు.. సహజమే. అయితే ఆ సందర్భం ఏ ఒక్కరిలోనైనా తీవ్ర ఒత్తిడికి దారి తీస్తే మాత్రం ఆ తరహా చర్చ అనారోగ్యకరమే. అది దారి మళ్లుతుందనిపిస్తే దాన్ని అక్కడే ఆపేయడం మంచిది. ఒకవేళ పొరపాటు ఎవరిదైనా ఎదుటివారి మనసును బాధపెట్టినందుకు క్షమించమని అడగాలి.

సాన్నిహిత్యం.. ఆలుమగల మధ్య ఉండే సాన్నిహిత్యం వారిని మరింత ప్రేమతో కట్టిపడేస్తుంది. భాగస్వామి చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకోగలగితే సమస్యలకు తావుండదు.

పంచుకోవాలి.. భార్యాభర్తల మధ్య రహస్యాలు లేకుండా ఉంటే మంచిది. అప్పుడే ఎదుటివారిపై భరోసా ఉంటుంది. అలాంటప్పుడు ఏదైనా వాదోపవాదాలొచ్చినా ఎక్కువసేపు నిలవవు. అలాకాకుండా ఎదుటివారిపై మనసులో అనుమానం ఉంటే మాత్రం దేనిగురించి చర్చ మొదలుపెట్టినా... చివరికి గొడవగా మారే ప్రమాదం ఉంది. తమ వద్ద భాగస్వామి చాలా విషయాలను రహస్యంగా ఉంచుతున్నారనే ఆలోచనే.. అవతలి వ్యక్తిని ప్రశాంతంగా ఉండనివ్వదు. అందుకే... ఏ చిన్న అంశమైనా ఇరువురూ పంచుకోగలిగితే  చాలు..


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని