అనుబంధంలో అగాధం వద్దు
close
Published : 07/12/2021 00:50 IST

అనుబంధంలో అగాధం వద్దు

భార్యాభర్తల శరీరాలు వేరైనా.. ఆత్మ ఒకటిగా ఉంటేనే ఆ దాంపత్యం సంతోషంగా ఉంటుంది. ఇద్దరి బాధ్యతలు వేరైనా అందరూ ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో అడుగులేయాలి. అప్పుడే ఆ అనుబంధం పెరుగుతుంది.  శాశ్వతంగా నిలుస్తుంది... ఇదెలా వీలవుతుందో మానసిక నిపుణులు వివరిస్తున్నారు.

మనసులోని విషయాలను ఒకరికొకరు పంచుకోగలిగే స్వేచ్ఛ ఇద్దరికీ ఉండాలి. అప్పుడే ఏ సమస్య ఎదురైౖనా ఇద్దరూ సునాయసంగా ఎదుర్కోగలుగుతారు. కొన్ని సందర్భాల్లో భాగస్వామి దేన్నైనా చెప్పడానికి అయిష్టత ప్రకటిస్తే.. పదేపదే దాని గురించి అడగొద్దు. కాస్త ఏకాంతాన్నివ్వండి. ప్రశాంతంగా ఆలోచించుకోగలుగుతారు. అలాకాకుండా.. నాకెందుకు చెప్పలేదనే కోపాన్ని ప్రదర్శిస్తే అవతలి వ్యక్తికి అది అదనపు భారం కావొచ్చు. తానుగా చెప్పేవరకు సహనంగా ఎదురుచూడాలి. చెప్పాక త్వరగా దాంట్లోంచి బయటపడే తోడ్పాటు నివ్వండి.

*అన్యోన్యత.. భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి సమస్య వచ్చినా... ఒకరికొకరు తమకు అవతలి వ్యక్తి ఉన్నారనే భరోసా అందించ గలగాలి. ఎటువంటి సందర్భాల్లోనైనా భాగస్వామి తనకు తోడు ఉంటారన్న ఆలోచనే సగం మానసిక వేదనను దూరం చేస్తుంది. అంతేకాదు, ఎదుటివారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు గుర్తించగలగాలి. పరిష్కారం తోస్తే మృదువుగా వివరించాలి. ఇరువురి మధ్యా అవగాహన అన్యోన్యతను పెంచుతుంది. లేకపోతే దాంపత్య బంధంలో అది అగాధంలా మారే ప్రమాదం ఉంది.

* బాధ్యతలు.. బాధ్యతలను ఇద్దరూ పంచుకోవాలి. ఒక్కరు బాధ్యతారాహిత్యంగా ఉన్నా ఎదుటి వారికి ఆ విషయాన్ని సూచించాలి. కలిసి నడిస్తే ఎంత దూరమైనా అలసట తెలీదనే భావాన్ని సహనంగా చెప్పగలగాలి. క్రమేపీ భాగస్వామిలో మార్పు తీసుకురావడానికి కృషి చేయాలి. దంపతులిద్దరూ సమానంగా బాధ్యతలు వహించిన చోట పిల్లల్లోనూ తల్లిదండ్రులపై గౌరవం పెరుగుతుంది. వారు కూడా భవిష్యత్తులో ఈ అంశాలను పాటించి, ఉత్తమ పౌరులుగా నిలుస్తారు.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని