ఒక్కరే చాలనుకుంటున్నారా..!

జనాభా పెరుగుదలను అరికట్టాలని ప్రభుత్వం కుటుంబ నియంత్రణను ప్రోత్సహిస్తోంటే పెంపకం కష్టమని మనలో చాలామంది ఒక్కరితోనే సరిపెట్టేస్తున్నాం. కానీ దీని వల్ల వచ్చే సమస్యల గురించీ ఆలోచించారా?

Published : 08 Dec 2021 00:40 IST

జనాభా పెరుగుదలను అరికట్టాలని ప్రభుత్వం కుటుంబ నియంత్రణను ప్రోత్సహిస్తోంటే పెంపకం కష్టమని మనలో చాలామంది ఒక్కరితోనే సరిపెట్టేస్తున్నాం. కానీ దీని వల్ల వచ్చే సమస్యల గురించీ ఆలోచించారా?

క్కరే ఉంటే మన లోకమంతా వాళ్లే అవుతారు. దీంతో వాళ్లని పొద్దస్తమానం కనిపెట్టుకుని ఉంటూ అన్నీ నేర్పించాలనుకుంటాం. ఇది సరికాదు. ఇలాగైతే వాళ్లు సొంతంగా ఏమీ చేయలేరు. తోటి చిన్నారులతో కలిసి పెరిగితేనే శారీరక మానసిక ఎదుగుదల బాగుంటుంది.

* తోబుట్టువులు ఉన్న చిన్నారులు అల్లరిచేష్టల్లోనూ ఎన్నో నేర్చుకుంటారు. ప్రతిదానికీ తల్లిని ఆశ్రయించి ఏడుపు లంకించుకోరు. కోపతాపాలు ప్రదర్శించడం, ఓదార్చడం, సాయపడటం, ఫిర్యాదు చేయడం, ఎత్తుకు పై ఎత్తు వేయడం, ఎవరితో ఎలా మెలగాలి- లాంటి అనేక విషయాలు ఆడుతూపాడుతూ నేర్చుకుంటారు. ఒంటరిగా పెరిగేవాళ్లలో వీటికి చోటు తక్కువ.
* తోబుట్టువులున్న పిల్లలు కలివిడిగా ఉండటమే కాదు, సామర్థ్యాలను మెరుగుపరచుకుంటారు. బొమ్మలు మొదలు దుస్తుల వరకూ ఇచ్చిపుచ్చుకుంటారు. ఒక్కరే సంతానంగా పెరిగేవారు తమ వాటిని ఇతరులకు ఇచ్చేందుకు గానీ తమకు అవసరమైనవి అడిగేందుకుగానీ ఇష్టపడరు. ఈ లక్షణం పెద్దయ్యేకొద్దీ జటిలమవుతుంది.
* తాను మాత్రమే అన్నట్టు పెరగడంతో మంచీచెడూ పంచుకునేందుకు ఎవరూ లేక ఒంటరితనంతో బాధపడతారు. భావోద్వేగాలు పంచుకోలేకపోవడంతో భవిష్యత్తులో మితిమీరిన ఒత్తిడి, నరాల బలహీనత, గుండెజబ్బు లాంటి సమస్యలూ ఉత్పన్నమయ్యే ప్రమాదముంది. ఒక్కరుగా పెరిగే పిల్లల్లో వ్యక్తిత్వ లోపాలు చోటు చేసుకుంటాయి. మొండి వైఖరి అవలంబిస్తారు. ఎవరెంత చెప్పినా వినడానికి సుముఖత చూపరు. తోబుట్టువులు లేని చిన్నారుల్లో 54 శాతం మంది అత్యవసరమైనా నలుగురిలోకి వెళ్లలేకపోవడం, విపరీతమైన కోపం, డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టుగా అధ్యయనాల్లోనూ తేలింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్