కలిసి సాగితే.. బంధం పదిలం
close
Published : 09/12/2021 01:21 IST

కలిసి సాగితే.. బంధం పదిలం

పెళ్లికి ముందు, కొత్తల్లో ఉన్నదానికీ, కాలం గడిచేకొద్దీ ఉన్న వాతావరణానికీ తేడా ఉంటుంది. వాటిని అర్థం చేసుకుంటూ ముందడుగేయాలి. అప్పుడే ఆ బంధం కలకాలం సాగుతుంది.

భార్యభర్తలు రెండు విభిన్ననేపథ్యాల నుంచి వివాహమనే బంధంతో ఒక్కటవుతారు. పెళ్లయిన కొత్తలో ఒకరిపై మరొకరికి చాలా అంచనాలుంటాయి. అయితే కొన్నాళ్లకే తాము పొరపడినట్లు చాలామంది భావిస్తారు. భాగస్వామి ఇలా ఉండాలి, అలా చూసుకోవాలి... అనుకోవడం సహజమే అయితే అవి వాస్తవానికి దూరంగా ఉండకూడదు. భాగస్వామి ఎలా ఉన్నా స్వీకరించే గుణం ఉంటే ఆ బంధం కొనసాగుతుంది.

కాస్త సమయం.. వ్యాపారం, ఉద్యోగం.... చేసే పని ఏదైనా అందులో నిరంతరం కష్టపడాల్సిందే. భార్యాభర్తలిద్దరూ పనిచేసే రోజులివి. దాంతో ఇద్దరూ బిజీగా ఉండొచ్చు. ఒకరికి వీలైన సందర్భంలో మరొకరికి తీరిక లేకపోవచ్చు. అంత మాత్రాన ఎదుటివారిపై కోపం పెంచుకోవడం, గొడవలకు దిగడం మంచిది కాదు. ఇలా చేస్తే వివాహ బంధం బలహీనమయ్యే ప్రమాదం ఉంది. అలా కాకూడదంటే... ఒకరికొకరు సమయం కేటాయించుకోవాలి. ఉన్న సమయాన్నే జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవాలి. కుదరకపోతే కనీసం ఫోన్‌లోనైనా క్షేమసమాచారాలు కనుక్కోవడం... ఆత్మీయంగా మాట్లాడుకోవడం, చాటింగ్‌ లాంటివి మిమ్మల్ని మరింత దగ్గర చేస్తాయి.

బాధిస్తుందది.. కొందరు ఏదైనా గొడవ మొదలైనప్పుడు అరవడం, దూషించడం లాంటివి చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. మాట చాలా పదునైంది. తెలియకుండానే మనసును గాయపరుస్తుంది. కాబట్టి మాట జాగ్రత్త. ఎదుటి వారు కోపంగా ఉన్నా... మనకు కోపం వచ్చినా ఆ కాసేపు మౌనంగా ఉండాలి. కోపం తగ్గిన తర్వాత అవతలివారు చేసిన పని వల్ల మీరెంత బాధపడ్డారో స్పష్టంగా వివరించాలి. అంతే తప్ప ఎదురుదాడికి దిగొద్దు.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని