నొప్పించకుండా నో చెప్పండిలా
రాధతో ఆమె చిన్ననాటి స్నేహితుడు తనను పెళ్లి చేసుకోవాలనుంది అన్నాడు. ఆమెకేమో ఆ ఆలోచన లేదు. ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో మానసిక నిపుణులు సూచిస్తున్నారిలా..
రాధతో ఆమె చిన్ననాటి స్నేహితుడు తనను పెళ్లి చేసుకోవాలనుంది అన్నాడు. ఆమెకేమో ఆ ఆలోచన లేదు. ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో మానసిక నిపుణులు సూచిస్తున్నారిలా..
మనసులోని ఆలోచనలను అవతలివారి భావోద్వేగాలను కించపరచకుండా మృదువుగా చెప్పాలి. వారి ఆలోచనలను, మీపై ఉన్న ప్రేమాభిమానాలను అగౌరవపరచకూడదు. ‘నా మనసులో అటువంటి ఆలోచన లేద’నే మాటను వారికి అర్థమయ్యేలా చెప్పగలగాలి.
* వారిని దూరం పెట్టకూడదు. అలాగే కలవకుండా ఉండటానికి బిజీగా ఉన్నానంటూ అబద్ధాలు చెప్పకుండా నిజాయతీగా ప్రవర్తించాలి. ఎప్పటిలాగే ఉంటేనే వారికి మిమ్మల్ని అపార్థం చేసుకున్న విషయం తెలుస్తుంది. అవతలివారు అడిగే ప్రశ్నలకు తప్పించుకోకుండా సమాధానం చెప్పండి.
* అప్పటికప్పుడు ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం లేనిపోని ఆశలు కల్పించొద్దు. ఇప్పుడుకాదు.. తర్వాత చూద్దాం, కొన్ని రోజుల తర్వాత నా అభిప్రాయం చెబుతా అనే మీ మాటలు అతడిలో కొత్త ఆశలను కల్పించడానికి కారణమవుతాయి. అది మీ కెరియర్‌కూ ప్రతిబంధకం అవుతుంది. ‘నో’ని స్పష్టంగా చెప్పండి. అప్పుడే మీ ఇరువురి మధ్యా ఉన్న స్నేహబంధం పదిలంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.