అలసట పోగొట్టే బంధువులు

రోజూ కుటుంబంతో ఉన్నా అప్పుడప్పుడూ బంధువులను కలుస్తుంటాం. ముఖ్యంగా పెళ్లిళ్లు, పేరంటాల్లాంటి సందర్భాల్లో బంధువుల పాత్ర చాలా ముఖ్యమైంది. ఆ సంబంధ బాంధవ్యాలు లేకుంటే ఒంటరితనం చోటుచేసుకునే ప్రమాదముందని...

Updated : 17 Dec 2021 06:21 IST

రోజూ కుటుంబంతో ఉన్నా అప్పుడప్పుడూ బంధువులను కలుస్తుంటాం. ముఖ్యంగా పెళ్లిళ్లు, పేరంటాల్లాంటి సందర్భాల్లో బంధువుల పాత్ర చాలా ముఖ్యమైంది. ఆ సంబంధ బాంధవ్యాలు లేకుంటే ఒంటరితనం చోటుచేసుకునే ప్రమాదముందని... అలా కాకుండా ఉండాలంటే బంధుత్వాలను కొనసాగించాలని చెబుతున్నారు మనస్తత్వ నిపుణులు.

ఇల్లూ ఉద్యోగాలకే పరిమితం కావాలనుకోవద్దు. సెలవు రోజుల్లో లేదా సాయంత్రం వేళ కాసేపు బంధువుల ఇంటికి వెళ్లండి. వారికి సమయం కుదిరి నప్పుడు మీ ఇంటికి ఆహ్వానించండి. ఆ కబుర్లూ కాలక్షేపాలూ రోజు వారీ అలసటలను పోగొడతాయి.

* పనితో విసిగి పోయినప్పుడు కొంత సేపు విరామం ఇవ్వండి. ఆత్మీయంగా అనిపించే బంధువులకు ఫోన్‌ చేసి మాట్లాడండి. అసహనాలూ ఆందోళనల నుంచి తప్పకుండా బయటపడతారు.

* జీవితం మరీ రొటీన్‌గా అనిపిస్తోంటే ఒకటి రెండు రోజులు ఆఫీసుకు సెలవుపెట్టి కుటుంబమంతా కలిసి దూర ప్రాంతంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లండి. ఉత్తేజాలను మోసుకుంటూ తిరిగొస్తారు.

* ప్రతి సమస్యనూ మీరే పరిష్కరించుకోలేకపోవచ్చు. ఒక్కోసారి బంధువులతో చర్చించడం వల్ల వాళ్లు చక్కటి మార్గాలు సూచించే అవకాశం ఉంది. అది మీకెంతో ఊరటనిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్