అనుబంధానికి అయిదు సూత్రాలు

నూరేళ్లు ఆనందంగా కలిసి సాగాలనే ఆశతో మొదలవుతుంది ఏ బంధమైనా! అయితే అందుకు తగ్గ ప్రయత్నమూ జోడించాలి. అది ఇరువర్గాల నుంచీ ఉండాలి.

Published : 23 Dec 2021 01:17 IST

నూరేళ్లు ఆనందంగా కలిసి సాగాలనే ఆశతో మొదలవుతుంది ఏ బంధమైనా! అయితే అందుకు తగ్గ ప్రయత్నమూ జోడించాలి. అది ఇరువర్గాల నుంచీ ఉండాలి.

1 సహానుభూతి: ఒకరికొకరు అవతలి వ్యక్తి కోణం నుంచి ఆలోచించగలగాలి. కోపం, ఆనందం, బాధ సందర్భమేదైనా అర్థం చేసుకుని, తోడుగా నిలవగలగాలి.

2 మద్దతు: ఇద్దరికీ వేర్వేరు లక్ష్యాలు ఉండొచ్చు. పెళ్లి కారణంగా ఎవరో ఒకరు వాటికి దూరమవ్వాల్సిన పని లేదు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఎదుటివారు వాటిని చేరుకునేలా చూడాలి. ఇద్దరూ సమానమే. ఒకరు ఎక్కువ, తక్కువ; ఒకరి వాటికే విలువ అన్న ధోరణి ఉండొద్దు. ఆసక్తులు, ప్రాధాన్యాలూ భిన్నంగా ఉండొచ్చు. ఒకరికి కెరియర్‌ ముఖ్యమైతే మరొకరికి ఆర్ట్స్‌లో ఆసక్తి ఉండొచ్చు. తెలుసుకొని ప్రోత్సహించాలే కానీ చిన్నచూపు చూడొద్దు.

3నమ్మకం: ఏ బంధానికైనా పునాది ఇదే! కలిసి అడుగేయాలని నిర్ణయించుకున్నాక అరమరికలు లేకుండా చూసుకోవాలి. అది అవతలి వారికి మనమిచ్చే స్వేచ్ఛతోనే సాధ్యమవుతుంది. తప్పు, ఒప్పు ఏదైనా పంచుకోవాలి, అవతలి వ్యక్తీ పంచుకునేలా ప్రోత్సహించాలి. అన్నింటినీ అందరూ ఒకేలా తీసుకోలేరు. కాబట్టి, చిన్న విషయమని తోసిపుచ్చడం, వినగానే కోపగించుకోవడం చేయొద్దు. చర్చించండి, వీలైతే సరైన మార్గం సూచించండి.

4గౌరవం: అవతలి వ్యక్తికి మీరెంత విలువనిస్తున్నారో తెలిపే మార్గమిది. ఎదుటి వారు చేసిన పని, వాళ్ల ఫీలింగ్స్‌కి ప్రాధాన్యమివ్వడం.. ఏదైనా గౌరవం కింద లెక్కే.

5కమ్యూనికేషన్‌: ఎప్పుడూ ఒకరు చెప్పడం, మరొకరు వినడంలా ఉండకూడదు. రెండువైపులా సాగాలి. సర్దుకుపోవడమూ ఇరువైపులా ఉండాలి. మన మనసులో మాట వింటారు, అర్థం చేసుకుంటారు.. అవసరమైతే సర్దుకుంటారు, లేదంటే చర్చించే అవకాశమిస్తారు అని ఇరువురికీ అనిపిస్తేనే..
ఆ అనుబంధం ఆనందంగా సాగగలుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్