మీ ఫోను... పిల్లలకు కష్టం!

అమ్మానాన్నలు స్మార్ట్‌ ఫోనుల్లో మునిగిపోతే అది పిల్లల ఎదుగుదలపై తీవ్ర చెడు ప్రభావం చూపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇదే విషయాన్ని తాజాగా ఓ అధ్యయనం కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్‌, టెల్‌ అవివ్‌ విశ్వ విద్యాలయ అధ్యయన బృందం చేపట్టిన సర్వేలో పలురకాల వివరాలు వెలుగులోకి వచ్చాయి....

Updated : 25 Dec 2021 05:17 IST

అమ్మానాన్నలు స్మార్ట్‌ ఫోనుల్లో మునిగిపోతే అది పిల్లల ఎదుగుదలపై తీవ్ర చెడు ప్రభావం చూపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇదే విషయాన్ని తాజాగా ఓ అధ్యయనం కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్‌, టెల్‌ అవివ్‌ విశ్వ విద్యాలయ అధ్యయన బృందం చేపట్టిన సర్వేలో పలురకాల వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ల్లిదండ్రులు ఎక్కువగా ఫోన్‌ వినియోగించడం లేదా పుస్తకపఠనం కోసం సమయాన్ని వెచ్చించడంతో వారికి పిల్లలపై ఏకాగ్రత తగ్గుతోంది. తత్ఫలితంగా అది చిన్నారుల ఎదుగుదలపై దుష్ప్రభావం చూపిస్తోంది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంభాషణ కూడా అంతగా లేదు, దీంతో ఇరువురి మధ్య అనుబంధం తగ్గి, దూరం పెరుగుతోంది. పిల్లలకు ఫోన్స్‌ ఇవ్వడం, వాటితో ఆడుకోవడానికి అనుమతించే సమయంలో ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో తామూ ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నామని సగానికిపైగా తల్లులు చెప్పారు. మరికొందరు తమకు అతిగా పత్రికలు చదివే అలవాటుందని పేర్కొన్నారు. పిల్లలు ఆడుకుంటుంటే తాము పుస్తకాలు చదువుకుంటామని తెలిపారు. గదిలో ఫోన్‌, పుస్తకాలు లేనప్పుడు మాత్రమే పిల్లలతో ఎక్కువగా మాట్లాడుతూ వారితో సమయాన్ని వెచ్చిస్తున్నామన్న వారు అతి కొద్ది మందే. ఫోన్స్‌, పుస్తకాలపై ఎక్కువ శ్రద్ధ ఉన్న తల్లిదండ్రులు పిల్లలపై తక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు తేలింది. దీంతో పిల్లలతో వీరి సంభాషణ లేదా ఆడటం వంటివన్నీ తగ్గిపోయాయి. ఎక్కువ సమయం అమ్మానాన్నల ఏకాగ్రతను పొందుతున్న వారి శారీరక, మానసికారోగ్యం మెరుగ్గా ఉన్నాయి. పిల్లలతో వీలైనంత సమయం గడిపితేనే వారి మెదడు చురుకుగా మారి ఆ ప్రభావం ఎదుగుదలలో ప్రస్ఫుటమవుతుందని సూచిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్