భేదాభిప్రాయాలు రానీయొద్దు...

రాధ తన పిల్లల కారణంగా భర్తతో నిత్యం ఏదో ఒక విషయంలో తగాదా పడుతూనే ఉంటుంది. చిన్నచిన్న విషయాలను భేదాభిప్రాయాలు వచ్చేవరకు సాగదీయకూడదని సూచిస్తున్నారు.

Updated : 31 Dec 2021 05:28 IST

రాధ తన పిల్లల కారణంగా భర్తతో నిత్యం ఏదో ఒక విషయంలో తగాదా పడుతూనే ఉంటుంది. చిన్నచిన్న విషయాలను భేదాభిప్రాయాలు వచ్చేవరకు సాగదీయకూడదని సూచిస్తున్నారు.

ఇంట్లో పిల్లలను తండ్రి, ఇతరపెద్దవారికి దగ్గర చేయడానికి ప్రయత్నించాలి. అలాగే తోబుట్టువుల మధ్య సఖ్యతను పెంచాలి. చిన్నారులు ఒకరితో మరొకరు స్నేహంగా, సంతోషంగా ఉంటే సమస్యలకు తావుండదు. అలాగే వారి ప్రవర్తనలో లోపాలు కనిపించినప్పుడు వాటిని అందరిమధ్యకు తీసుకురాకుండా వ్యక్తిగతంగా వారితోనే మృదువుగా చెప్పగలగాలి. పిల్లలు అల్లరి చేసిన వెంటనే గట్టిగా కోప్పడి అరిస్తే ఇంట్లో వాతావరణమే మారిపోతుంది. పిల్లలకు సంబంధించిన సమస్య ఏదైనా వచ్చినప్పుడు దాన్ని అందరి ఎదుట కాకుండా భార్యాభర్తలు విడిగా చర్చించుకోవాలి. ఇరువురి మధ్య సంభాషణ కూడా మృదువుగానే ఉండాలి. భాగస్వామి కాస్తంత కోపంగా ప్రవర్తించినా ఎదుటివారు ప్రశాంతంగా సంభాషించాలి. అప్పుడే సమస్యకు తగిన పరిష్కారం దొరుకుతుంది. లేదంటే చిన్నచిన్న విషయాలు కూడా పెద్దపెద్ద సమస్యలుగా పరిణమించే ప్రమాదం ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్