close
Published : 23/01/2022 00:39 IST

మరోసారి ప్రేమయాత్ర...

ఇంటిని చక్కదిద్దుకోవడం అంత తేలికైన పనేమీ కాదు. పొద్దున్నే కాఫీతో మొదలైతే రాత్రి పాలు తోడెయ్యడం వరకూ ఎన్నో పనులు. మధ్యలో పిల్లల పేచీలు, కుటుంబసభ్యుల అలకలు.. ఈ క్రమంలో ఒక్కోసారి ఆలుమగల అనుబంధానికి బీటలు పడే ప్రమాదముంది. అలా జరక్కుండా ఉండాలంటే కొన్ని సూత్రాలు పాటించాల్సిందే..

* భార్యభర్తల మధ్య ఆధిపత్యాలు వద్దు. ఇద్దరూ స్నేహితుల్లా ఉండండి. ఒకరి ఆసక్తులూ అభిరుచులను మరొకరు గౌరవించుకోండి. మన ఇష్టాన్ని లేదా అయిష్టాన్ని అవతలి వ్యక్తి గుర్తుంచుకున్నారంటే దానివల్ల బోల్డంత ప్రేమ కలుగుతుంది.

* ఇరువైపుల బంధుమిత్రులనీ ఇద్దరూ ఆదరించడం వల్ల మీ మధ్య బంధం మరింత చిక్కబడుతుంది. మీరిద్దరే ఒకరికొకరు చాలనుకుంటే ఆనక ఎలాంటి కష్టమొచ్చినా ఎవరి సహకారమూ అందక అలమటించాల్సి వస్తుంది.  

* మీకు ఏ విషయంలో అశాంతిగా, ఆందోళనగా ఉందో, భర్త నుంచి ఏం కోరుకుంటున్నారో సౌమ్యంగానే అయినా స్థిరంగా చెప్పండి. మీ ఇద్దరి మధ్యా ఎలాంటి అపార్థాలకూ తావు లేకుండా చేయండి. మనసులోనే ఉంచుకుని బాధపడితే సమస్య పెద్దదవుతుందే తప్ప పరిష్కారం కాదు. చెప్పడం వల్ల తప్పకుండా ఫలితం ఉంటుంది.

* చాలామంది హనీమూన్‌ అంటే పెళ్లయిన కొత్తలో మాత్రమే వెళ్తారనుకుంటారు. నిజానికి జీవితం యాంత్రికంగా మారినప్పుడల్లా ఏదైనా ప్రదేశానికి వెళ్లి రెండు మూడు రోజులైనా ఉండి రండి. కొత్త ఉత్సాహం మీ సొంతమవుతుంది. అందుకోసం కొంత పైకాన్ని తప్పకుండా పక్కన పెట్టండి.

* ఇంటి పనులు ఇద్దరూ కలసిమెలసి చేసుకోండి. దాంతో ఒక్కరే పనిభారాన్ని మోస్తున్న భావన ఉండదు. ఒకరికొకరు సహకరించుకోవడం వల్ల పరస్పరం గౌరవభావం పెరుగుతుంది.


Advertisement

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి