ఆ విషయాల్లో తగ్గేదేలే!

వివాహ బంధం నిత్యనూతనం... ఎల్లప్పుడూ దాన్ని ఆనందంగా, మరింత దృఢంగా ఉండేలా మలుచుకోవడం ఆలుమగల వల్లే అవుతుంది. కాబట్టి ఇద్దరూ తమ సంసార నౌక సజావుగా సాగిపోవాలంటే సంతోషమనే ఇంధనం కావాల్సిందే. అప్పుడే అది అపురూపమైన బంధంగా మారుతుంది.

Updated : 27 Jan 2022 04:47 IST

వివాహ బంధం నిత్యనూతనం... ఎల్లప్పుడూ దాన్ని ఆనందంగా, మరింత దృఢంగా ఉండేలా మలుచుకోవడం ఆలుమగల వల్లే అవుతుంది. కాబట్టి ఇద్దరూ తమ సంసార నౌక సజావుగా సాగిపోవాలంటే సంతోషమనే ఇంధనం కావాల్సిందే. అప్పుడే అది అపురూపమైన బంధంగా మారుతుంది.

రోజూ ఉదయం లేవగానే ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకోండి ఆఫీసుకు వెళ్లేటప్పుడు వీలైతే భాగస్వామి నుదుటిపై  మనస్పూర్తిగా ఓ ప్రేమపూరిత ముద్దు, ఆత్మీయ ఆలింగనం...ఇస్తే చాలు.. ఆ రోజంతా ఆ మధుర  జ్ఞాపకాలు మీరిరువురి వెంటే ఉంటాయి..

* మీరిద్దరూ కలిసిన సమయంలో ఒకరికొసం మరొకరు అన్నట్లుగా ఉండండి. అంతే తప్ప ఫేస్‌బుక్‌, వాట్సప్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో దూరిపోవద్దు.

* వీలున్నప్పుడల్లా మీ రెండు కుటుంబాలను ఒక చోటకు చేర్చి అందరూ ఆనందంగా ఉండేలా ప్లాన్‌ చేసుకోండి.

* ఆలుమగలిద్దరూ మాట్లాడుకునే సమయంలో, ఇద్దరూ కలిసి పచారీ కొట్టుకు వెళ్లేటప్పుడు చరవాణిని మరిచిపోండి. వెంట అస్సలు తీసుకెళ్లొద్దు.

* భాగస్వామి అభిరుచులను తెలుసుకుని వాటిలో తను నిష్ణాతులయ్యేలా చేసి ఆనందం పొందాలి.

* డబ్బు విషయంలో ఇద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రూపాయికి లెక్క ఉండేలా చూసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో గొడవలు తప్పవు.

* భాగస్వామి మాట వినడానికి ఉత్సుకత చూపాలి. అప్పుడే ఎదుటివారికి మీరంటే ప్రేమ రెట్టింపవుతుంది.

* ఎన్ని పనులున్నా.... ఇద్దరూ కలిసి ఏడాదికోసారి దూర ప్రయాణాలు చేయాలి. అదేనండి విహారయాత్రలకెళ్లాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్