చదవాలా.. వీడియో గేమ్‌ కొనివ్వండి!

కొద్దిమంది పిల్లలు పై తరగతులకు వెళుతున్నా.. అక్షరాలను గుర్తించడంలో, చదవడంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు వాళ్ల చేతుల్లో వీడియో గేమ్‌ ఉంచి, ఆడేలా ప్రోత్సహించమంటున్నారు నిపుణులు. ఇవి ఆ నైపుణ్యాలను

Updated : 30 Jan 2022 06:34 IST

కొద్దిమంది పిల్లలు పై తరగతులకు వెళుతున్నా.. అక్షరాలను గుర్తించడంలో, చదవడంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు వాళ్ల చేతుల్లో వీడియో గేమ్‌ ఉంచి, ఆడేలా ప్రోత్సహించమంటున్నారు నిపుణులు. ఇవి ఆ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయట. స్విట్జర్లాండ్‌లోని జెనీవా విశ్వవిద్యాలయ బృందం తాజాగా జరిపిన పరిశోధనలో ఈ విషయం రుజువైంది. వీడియో గేమ్స్‌ ఆడేవారిలో చదవడానికి సంబంధించిన నైపుణ్యాలు మెరుగవుతున్నాయట. ముఖ్యంగా యాక్షన్‌ సంబంధితమైన వాటిని ఎంచుకుంటే మంచిదంటున్నారు. వీటిలో ఏకాగ్రత, ఆలోచించడం, గుర్తుపెట్టుకోవాల్సి రావడం.. వంటివి ఇందుకు సాయపడుతున్నాయట.

8-12 ఏళ్ల వయసున్న 150 మంది ప్లిలలపై ఈ పరిశోధన నిర్వహించారు. దీనికోసం గ్రహాలను రక్షించడమనే అంశంతో నిర్ణీత సమయాలను నిర్ణయించి చిన్న చిన్న ఆటలను రూపొందించారు. వాటిలో భాగంగా వచ్చే గుర్తులు, శబ్దాలను గమనించి వాటి ద్వారా ముందుకు సాగాల్సి ఉంటుంది. వీటిని గుర్తుంచుకుంటూ బాగా ఆడుతున్నవారిలో అక్షరాలను గుర్తించే, బాగా చదవగలిగే నైపుణ్యాలు పెరగడం గమనించారు. కచ్చితత్వంతోపాటు వేగంగా కూడా చదవగలగలుగుతున్నారట. రెండేళ్లపాటు ఈ పరిశోధన నిర్వహించి ఈ ఆటల్ని బాగా ఆడుతున్నవారు బాగా చదవగలిగేవారుగా తయారవుతున్నారని నిర్ధారించారు. కొందరిలో రాత నైపుణ్యాలూ మెరుగయ్యాయట. అంతేకాదు.. వీటిద్వారా వారిలో ఊహాశక్తితోపాటు సృజనాత్మకతా పెరుగుతోందని చెబుతున్నారు. రోజులో లేదా వారంలో కొంత సమయాన్ని నిర్ణయించి ఆడనిస్తే.. వాళ్లూ ఉత్సాహంగా ఉంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్