ఆత్మీయంగా హత్తుకోండి

చిన్నపాటి గొడవ... భార్యాభర్తల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతుంది. పెద్ద అగాధాన్ని సృష్టిస్తుంది. బంధాన్ని బలహీనపరుస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే.. పొరపాటు ఎవరిదైనా దాన్ని సరిదిద్దడానికి మీ వంతు ప్రయత్నం చేయడంలో తప్పు లేదు.

Published : 02 Feb 2022 01:14 IST

చిన్నపాటి గొడవ... భార్యాభర్తల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతుంది. పెద్ద అగాధాన్ని సృష్టిస్తుంది. బంధాన్ని బలహీనపరుస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే.. పొరపాటు ఎవరిదైనా దాన్ని సరిదిద్దడానికి మీ వంతు ప్రయత్నం చేయడంలో తప్పు లేదు.

చిన్న విరామం... శ్రీవారితో మాట్లాడుతున్నప్పుడు విషయమేదైనా... అది గొడవకు దారితీస్తుందని మీకనిపించినప్పుడు కాసేపు అక్కడి నుంచి పక్కకు వచ్చేయండి. కొన్ని నీళ్లు తాగండి. మీరు పెంచుకునే మొక్కలను కాసేపు చూడండి. ఇవన్నీ మీలోని కోపాన్ని, బాధని కాస్త ఉపశమింపజేస్తాయి. తిరిగి భాగస్వామి దగ్గరకు వచ్చి ప్రశాంతంగా మాట్లాడండి. ఈ కాస్త విరామంతో మీ ఇద్దరిలోనూ కోపాలు తగ్గి సమస్యకు పరిష్కారం కనుక్కునే దిశగా అడుగులు వేయొచ్చు.

తప్పును అంగీకరించండి... మీరు ఏం మాట్లాడం వల్ల ఎదుటివారికి కోపం వచ్చిందో చెప్పమనండి. ఒకవేళ పొరపాటుగా తప్పుగా మాట్లాడితే దాన్ని అంగీకరించండి. అవసరమైతే క్షమించమని అడగండి. ఇందులో పోయేదేం లేదు... ఇంకా చెప్పాలంటే గొడవ అక్కడితో సద్దుమణుగుతుంది. దాంతో ఇద్దరికీ ప్రశాంతత లభిస్తుంది.

ఆ సమయానికి ఆపేయండి... భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలొచ్చినా రాత్రి నిద్రపోయే సమయానికి సమసి పోయేలా చూసుకోవాలంటారు నిపుణులు. కోపం, కలత చెందిన మనసుతో నిద్రిస్తే అది మరుసటి రోజుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందట. దాంతో మర్నాడూ ఇంట్లో యుద్ధవాతావరణమే కనిపిస్తుంది.

ఆత్మీయ స్పర్శ... పది మాటల కంటే ఒక ఆత్మీయ స్పర్శ, ఆలింగనం చాలు. మీరేంటో, భాగస్వామి మీద మీకెంత ప్రేముందో చెబుతుంది. నవ్వుతూ ఆప్యాయంగా హత్తుకోండి. ఎంత కోపం ఉన్నా ఇట్టే కరిగిపోతారు. ఆనక సమస్య గురించి ప్రశాంతంగా పరిష్కారాన్ని కనుక్కోవచ్చు. ఏమంటారు?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్