సినిమాల్లోనే సాధ్యం!

మితిమీరిన అంచనాలు ఏ బంధాన్నయినా బలహీనపరుస్తాయి. మీరనుకున్నట్లుగానే భాగస్వామి నడుచుకోవాలనుకోవడం, మీ అంచనాలను ప్రతిసారీ అందుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది. సంసార నౌక చక్కగా సాగాలంటే భాగస్వామి నుంచి ఈ విషయాలను ఆశించకండి మరి.

Updated : 12 Feb 2022 04:32 IST

మితిమీరిన అంచనాలు ఏ బంధాన్నయినా బలహీనపరుస్తాయి. మీరనుకున్నట్లుగానే భాగస్వామి నడుచుకోవాలనుకోవడం, మీ అంచనాలను ప్రతిసారీ అందుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది. సంసార నౌక చక్కగా సాగాలంటే భాగస్వామి నుంచి ఈ విషయాలను ఆశించకండి మరి.

* శ్రీవారికి మీరెంత ఇష్టమైనా మీ మనసులో ఎప్పుడు ఏమనుకుంటున్నారో ఆయన కనిపెట్టలేకపోవచ్చు. కాబట్టి మీకేమైనా కావాలంటే... ఏదైనా చెప్పాలంటే... మనసు విప్పి చెప్పేయండి. అంతేకానీ ఆయనే తెలుసుకోవాలి, తెచ్చిపెట్టాలని ఆశించొద్దు.   ఇలాంటివి సినిమాల్లోనే బాగుంటాయి. నిజజీవితంలో కాదు.

* పెళ్లవగానే వ్యక్తులు, వ్యక్తిత్వాలు మారిపోవాలని ఎక్కడా లేదు. కుటుంబానికి తగ్గట్టుగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. అంతే తప్ప చిన్నప్పటి నుంచి పాటించిన విలువలు, అలవాట్లను ఒక్కసారే మీ కోసం మార్చుకోమని ఒత్తిడి చేయడం సరికాదు. ఇలా చేస్తే బంధం బలహీనమవ్వొచ్చు.

* అందరూ అన్ని పనులూ ఒకేలా చేయలేరు... అలాగే ఒకే సమయానికీ పూర్తి చేయలేరు. అలాగే మీ భాగస్వామి కూడా అని గుర్తించండి. తనకు అప్పగించిన పనులను సమయానికి పూర్తి చేయట్లేదనో... నెమ్మదిగా చేస్తున్నారో దెప్పిపొడవడం భావ్యం కాదు. ఒకవేళ మిమ్మల్ని మెప్పించాలని త్వరగా చేసినా అది సరిగా చేయలేకపోతే అప్పుడూ ఇబ్బందే కదా. సర్దుకుపోవడం నేర్చుకోండి.

* మీ ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. చేసే పనుల్లో వేగం ఉంటుంది... ఇలా చాలా సుగుణాలు మీ సొంతం. అయితే వాటిని ప్రతి సారి, ప్రతిక్షణం మీ భాగస్వామి మెచ్చుకోవాలని ఎదురుచూడొద్దు. కొన్ని సందర్భాల్లో మీ నైపుణ్యాలు తనకు సాధారణంగా అనిపించొచ్చు. అంత మాత్రాన బాధపడాల్సిన పనీ లేదు. ఈ చిన్న విషయాన్ని పెద్దది చేయొద్దు. మీరేంటో మీకు తెలుసు కదా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్