స్నేహబంధం ఎంతో విలువైనది!

స్నేహితులు అంటే సరదాలూ, షికార్లలో తోడుండే వారే కాదు... ఆ బంధంలో అంతకు మించి మరెన్నో లాభాలున్నాయి. కెరియర్‌, కుటుంబం, ఆరోగ్యం... ఏ అంశంలో ఒడుదొడుకులు వచ్చినా పక్కన స్నేహితులంటే ఆ ధైర్యమే వేరు...

Published : 25 Feb 2022 00:24 IST

స్నేహితులు అంటే సరదాలూ, షికార్లలో తోడుండే వారే కాదు... ఆ బంధంలో అంతకు మించి మరెన్నో లాభాలున్నాయి. కెరియర్‌, కుటుంబం, ఆరోగ్యం... ఏ అంశంలో ఒడుదొడుకులు వచ్చినా పక్కన స్నేహితులంటే ఆ ధైర్యమే వేరు...

ఒత్తిడి దూరం... ఒత్తిడి కలిగించే సందర్భాలూ, సంఘటనలూ ఎవరికైనా సహజం. కానీ ఇబ్బందుల్లో ఆదుకునే వాళ్లు ఉన్నారన్న ధీమా ఉంటే ఒత్తిడి అంత తీవ్రంగా అనిపించదు. ఈమధ్య ఒత్తిడికి గురైన సందర్భాన్ని గుర్తు చేసుకోండి... ఆ సమస్యని కచ్చితంగా స్నేహితులతో పంచుకుని, వారి సాయంతో పరిష్కారాన్నీ కనుగొని ఉంటారు. ముఖ్యంగా కెరియర్‌ సమస్యల్ని పరిష్కరించడంలో స్నేహితులే ముందుంటారు.

ఆత్మవిశ్వాసం నింపుతారు... ఆత్మవిశ్వాసం సన్నగిల్లినపుడు మిమ్మల్ని మునుపటి వ్యక్తిలా మార్చేది స్నేహితులే. ఎందుకంటే మీ సంతోషం కోరుకునే వ్యక్తుల్లో ముందుండేది మిత్రులే. గతంలో అలాంటి సమస్యలు మీ స్నేహితులు ఎదుర్కొన్నపుడు మీరెలా సాయపడ్డారో గుర్తు చేసి మరీ ధైర్యం చెబుతారు. కుటుంబ, స్నేహ బంధాలు దృఢంగా ఉన్నవాళ్లు మానసికంగానూ నిబ్బరంగా ఉంటారు. ముఖ్యంగా నమ్మకం, గౌరవం, క్షమాగుణం ఇవన్నీ పెంపొందుతాయి.

ఎదుగుదలలో... మనచుట్టూ జరిగే మార్పుల గురించి ప్రధానంగా తెలిసేది స్నేహితుల నుంచే. స్నేహితుల్లో కొందరు కెరియర్‌ పరంగా, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే మీతో పంచుకుంటారు. మీకు ఆ ఆలోచన లేకపోయినా, వారిని చూసైనా స్ఫూర్తి పొందుతారు. వారితో చర్చించి మీ లక్ష్యాల్ని పెట్టుకుంటారు. కోర్సు నేర్చుకోవడం, మదుపు చేయడం, జిమ్‌లో చేరడం... ఇలాంటి విషయాల్లో స్నేహితుల ప్రభావమే ఎక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్