చిన్నారుల్లో ఊహాశక్తిని పెంచేలా..

పిల్లల్లో కొత్తగా ఆలోచించే విధానాన్ని, ఊహాశక్తిని పెంచాలంటే ఎక్కువగా కథల పుస్తకాలు చదవడం నేర్పించాలంటున్నారు మానసిక నిపుణులు. అవేంటంటే... ప్రతిరోజూ... ఏదో ఒక సమయంలో కథలు చదివించడం చిన్నప్పటి నుంచి నేర్పాలి. అదొక పనిలా కాకుండా సరదాగా కథలవైపు వారికి ఆసక్తి కలిగించాలి. వారెదుట కథల గురించి మాట్లాడుకోవాలి...

Published : 11 Mar 2022 00:53 IST

పిల్లల్లో కొత్తగా ఆలోచించే విధానాన్ని, ఊహాశక్తిని పెంచాలంటే ఎక్కువగా కథల పుస్తకాలు చదవడం నేర్పించాలంటున్నారు మానసిక నిపుణులు. అవేంటంటే...

ప్రతిరోజూ... ఏదో ఒక సమయంలో కథలు చదివించడం చిన్నప్పటి నుంచి నేర్పాలి. అదొక పనిలా కాకుండా సరదాగా కథలవైపు వారికి ఆసక్తి కలిగించాలి. వారెదుట కథల గురించి మాట్లాడుకోవాలి. సాహసోపేత లేదా నీతి కథాంశాలపై చర్చలు జరపాలి. వీలైతే పిల్లల స్నేహితులను కూడా ఆహ్వానించి అందర్నీ కూర్చోబెట్టి కథ చదివి వినిపించాలి. మధ్యలో ప్రశ్నలు వేయాలి. ఆ పాత్రల గురించి అభిప్రాయాన్ని అడుగుతూ.. కథా నాయకుడి పాత్రలో వారినే ఊహిస్తున్నట్లు చెప్పాలి. అది వారిని ఊహా ప్రపంచంలోకి విహరింపచేస్తుంది.

వరుసగా... ఒకే కథ అయితే త్వరగా పూర్తవుతుంది. అందుకే సిరీస్‌ను పరిచయం చేయాలి. ఎక్కువ భాగాల కథను మధ్యలో ఆపలేరు. ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకతతో అవన్నీ చదవడం కొనసాగిస్తారు. దీంతో పఠనాసక్తి పెరుగుతుంది. చదవడంలో వారేదైనా కఠిన పదాలతో ఇబ్బంది పడుతుంటే గుర్తించి, చేయూతనివ్వాలి.

పలుసార్లు.. నచ్చిన కథను ఒకటికన్నా ఎక్కువ సార్లు చదివే అలవాటున్న పిల్లలను ఆపకూడదు. అది వారిలో మరిన్ని కథలపై ఆసక్తిని పెంచుతుంది. అంతేకాదు... పాత్రలు, పదాలు, కథనశైలి వంటిన్నీ గుర్తుండి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు వారికిష్టమైన కథ పూర్తయిన తర్వాత మీరు చదవలేదని చెప్పి, కథ చెప్పమని అడగాలి. ఇది వారిని మంచి స్టోరీ టెల్లర్‌గా మారుస్తుంది.

గ్రంథాలయం.. దగ్గరలోని గ్రంథాలయాన్ని ఎంపిక చేసి అందులో పిల్లలను చేర్చాలి. ఇష్టమైన వాటిని ఎంచుకునే స్వేచ్ఛనివ్వాలి. అక్కడ పలువురు రచయితల కథలు పరిచయమవుతాయి. పిల్లలను బుక్‌ క్లబ్స్‌ ఏర్పాటు చేసుకోమని ప్రోత్సహించాలి. స్నేహితులతో కలిసి కథల గురించి చర్చించుకోవడం, కొత్త పుస్తకాలపై అవగాహన పెంచుకోవడం అలవడుతుంది. ఇవన్నీ చిన్నారుల్లో ఊహాశక్తిని పెంచి కొత్తగా ఆలోచించే సృజనాత్మకతను అందిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్