హద్దులుండాలి...

భార్యాభర్తల మధ్య కూడా కొన్ని హద్దులుండాలి. ఇవి మొదటి నుంచే ప్రారంభించాలి. లేదంటే ఇరువురి మధ్య బంధం కొంతకాలం సవ్యంగానే సాగినా.. నెమ్మదిగా సమస్యలెదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని నియమాలను బంధం మొదలైననాటి నుంచే పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

Updated : 15 Mar 2022 05:28 IST

భార్యాభర్తల మధ్య కూడా కొన్ని హద్దులుండాలి. ఇవి మొదటి నుంచే ప్రారంభించాలి. లేదంటే ఇరువురి మధ్య బంధం కొంతకాలం సవ్యంగానే సాగినా.. నెమ్మదిగా సమస్యలెదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని నియమాలను బంధం మొదలైననాటి నుంచే పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

నసులు కలిసిన వెంటనే లేదా వివాహం నిశ్చయమైన తర్వాత కొందరు తమ భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని చర్చించడం మొదలుపెడతారు. ఆ సమయానికి అలా పంచుకోవడం సంతోషంగా అనిపించినా... కొంత కాలానికి అదే సమస్యగా మారొచ్చు. అభిరుచులు, ఆశయాలను కాబోయే భర్తకు వివరించొచ్చు. అలాకాకుండా తమ గతాన్ని, పూర్తిగా పూసగుచ్చినట్లు చెప్పడంతో వాటికి సంబంధించిన ఏదైనా ఓ అంశం వైవాహికజీవితంలో పెద్ద సమస్యను తెచ్చిపెట్టొచ్చు. అలాగే తమలోని మైనస్‌లను విశదీకరించాల్సిన అవసరం లేదు. లేదంటే భవిష్యత్తులో అవే అవతలివారికి ఆయుధాలుగా మారుతాయి. ఏ విషయం పంచుకోవాలి లేదా ఎటువంటి అంశాన్ని కాబోయే జీవితభాగస్వామితో చెప్పాల్సిన అవసరం ఉందో.. లేదో ముందుగానే స్పష్టత ఉండాలి. అప్పుడే ఆ బంధం ఎక్కువకాలం నిలిచి ఉంటుంది.

చర్చించాలి...

ఆర్థికపరమైన అంశాలను ముందుగానే చర్చించుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికలు, పొదుపు పథకాలు మాట్లాడుకోవాలి. ఇంటి అవసరాలు, మున్ముందు పిల్లల చదువులు వంటివన్నీ ముందుగానే చర్చించుకుంటే మంచిది. ఎదుటివారికి వీటిపై అంతగా అవగాహన లేకపోతే మృదువుగా చెబుతూ వివరించాలి. అప్పుడే రానున్న కాలంలో ఇబ్బందులెదురవకుండా ఉంటాయి. ఇరువురూ ఉద్యోగులైతే ఇంటిపని, పిల్లల పెంపకం సహా ఆర్థిక అవసరాల్లోనూ పాలుపంచుకోవడంపై భాగస్వామి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకోవచ్చు. లేదంటే ఇవే పెను సమస్యలుగా మారే ప్రమాదం ఉంది. ఇరువురిలో ఒకరు బాధ్యతారాహిత్యంగా ఉన్నాకూడా సంసారం సాగించడం కష్టమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్