చిన్నారుల కోపం అదుపులో...

రాజీ ఎనిమిదేళ్ల కూతురికి కోపమెక్కువ. చిన్నదానికీ  గట్టిగా అరుస్తుంది. చేతిలోని వస్తువును దూరంగా విసిరేస్తుంది. చిన్నారుల కోపానికి కారణాన్ని ఆదిలోనే తల్లిదండ్రులు గుర్తించాలంటున్నారు నిపుణులు.

Updated : 25 Mar 2022 05:33 IST

రాజీ ఎనిమిదేళ్ల కూతురికి కోపమెక్కువ. చిన్నదానికీ  గట్టిగా అరుస్తుంది. చేతిలోని వస్తువును దూరంగా విసిరేస్తుంది. చిన్నారుల కోపానికి కారణాన్ని ఆదిలోనే తల్లిదండ్రులు గుర్తించాలంటున్నారు నిపుణులు.

పిల్లలు అలసినప్పుడు లేదా ఆకలి వేసినప్పుడు వారి కోపం తారస్థాయికి చేరుకుంటుంది. దాన్ని ఎలా ప్రదర్శించాలో తెలీక కోపంగా ఉంటారు. ఇతరుల వల్ల వారి మనసు గాయపడినప్పుడు లేదా ఒత్తిడి, ఆందోళనకు గురైనా వారికి కోపమే శరణ్యమవుతుంది. పిల్లలకు వారిక్కావలసింది దొరక్కపోయినా లేదా అవసరమైంది చేతిలోకి రాకపోయినా ఎలా చెప్పాలో తెలియని స్థితిలో కోపంతో ఊగిపోతారు. ఈ కారణాల్లో ఏది వారి మనసులో ఉందో తెలుసుకోగలగాలి. అప్పుడే వాటికి పరిష్కారాన్ని అందించగలుగుతాం.

అవగాహన.. చిన్నారులు కోపంగా ఉన్నప్పుడు ప్రేమగా దగ్గరకు తీసుకుని శాంతపరచాలి. కారణాన్ని అడిగి తెలుసుకోవాలి. ఆ తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు  అలా ప్రవర్తించడం తప్పని వారికి తెలిసేలా చెప్పాలి.

అప్పుడే తిరిగి వాళ్లు అలా ప్రవర్తించకుండా ఉంటారు. ఒకవేళ తిరిగి అదే కోపాన్ని ప్రదర్శించినా పెద్దవాళ్లు దండించకుండా సహనం వహించి ముందు చేసిన ప్రయత్నమే తిరిగి చేస్తుండాలి. క్రమేపీ వారి కోపాన్ని అదుపులో తేవడానికి కృషి చేస్తూనే ఉండాలి. భవిష్యత్తులో కోపం వల్ల కలిగే అనర్థాలు, ఎదురయ్యే సమస్యలపై వారికి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉండాలి. కోపం వచ్చినప్పుడు దాన్నెలా అదుపు చేసుకోవాలో కూడా వివరించాలి. అలాంటి సందర్భాల్లో కాసేపు మౌనంగా ఉండటం. అంకెలు లెక్కబెట్టడం, మనసుకు నచ్చిన పనేదైనా మొదలుపెట్టడం వంటివన్నీ కోపాన్ని నియంత్రించుకునే మంత్రాలే అని వారికి చెబితే చాలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్