ఈ విషయాల్లో జాగ్రత్త!

భాగస్వామితో అన్ని విషయాలను తప్పసరిగా పంచుకోవాలనీ లేదు. కొన్నింటిని దాచుకుంటే ఇద్దరికీ మేలు.  చెప్పేటప్పుడూ సంయమనం అవసరం.

Published : 07 Apr 2022 01:17 IST

భాగస్వామితో అన్ని విషయాలను తప్పసరిగా పంచుకోవాలనీ లేదు. కొన్నింటిని దాచుకుంటే ఇద్దరికీ మేలు.  చెప్పేటప్పుడూ సంయమనం అవసరం.

కుటుంబం... మీ భాగస్వామి మీ అమ్మానాన్నలను వెక్కిరిస్తే, తక్కువగా మాట్లాడితే మీకెలా అనిపిస్తుంది. అస్సలు బాగోదు కదూ. అలాగే అత్తగారింట్లో మీకు నచ్చని సభ్యులెవరైనా ఉంటే... వారితో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ విషయాన్ని ఆయనకు అర్థమయ్యేలా సానుకూలంగా, మెల్లిగా చెప్పండి. మీ అభియోగాలు మీ వారికి మీ పట్ల కోపం, చులకన భావాలను కలిగించవచ్చు. మీ అనుబంధం దృఢంగా ఉండాలంటే కుటుంబ బంధాలు ముఖ్యమని గుర్తుంచుకోండి.
విమర్శల బాణాలొద్దు... నిజాయతీగా ఉండటంలో తప్పులేదు. అయితే రోజూ ఎదుటివారిలో లోపాలను భూతద్దంలో చూస్తూ కించపరిచేలా మాట్లాడకూడదు. ఒకవేళ మీ భాగస్వామి చేసిన పని వల్ల మీకు ఇబ్బంది అయితే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. అంతే తప్ప వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు వద్దు.

గొడవలొద్దు... ఆర్థిక అంశాలను ఇద్దరూ కలిసి చర్చించుకోవాలి. కావాలనుకుంటే ఉమ్మడి ఖాతా తెరవండి. డబ్బును ఇద్దరూ జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఆర్థిక సమస్యలు వస్తే కలిసి పరిష్కరించుకోవాలే తప్ప ‘నేను చెబితే విన్నావా... నీవల్లే ఇంత నష్టం జరిగింది’ అంటూ విమర్శించుకోవద్దు. గొడవ పడటం సులభం. మళ్లీ అది తగ్గి మామూలుగా అవడం చాలా కష్టం. కాబట్టి వారితో ఆర్థిక వ్యవహారాలైనా, ఇతర అంశాలనైనా సున్నితంగానే మాట్లాడి పరిష్కరించుకోండి.

హద్దులు పెట్టొద్దు... మీ భాగస్వామి మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల ప్రభావం తప్పక ఉంటుంది. వారి నుంచి తనను దూరం చేయాలని ప్రయత్నించ వద్దు. కానీ వారి మాటలకు అనాలోచితంగా తల ఊపకుండా చేయగలరు. అదీ సానుకూల పద్ధతిలో మాత్రమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని