వినయం నేర్పాలి...
చిన్నారులకు కావలసినవన్నీ సమకూర్చడంతో మన బాధ్యత తీరిపోదు. వాళ్ల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం చాలా అవసరం. వాళ్లు నిజాయతీ అలవరచుకోవడం ఎంత ముఖ్యమో వినయంగా ఉండటమూ అంతే అవసరం. ‘నాకిది కావాల్సిందే’ అని రుబాబుగా అడిగితే ఇవ్వాలనుకున్నది కూడా ఇవ్వాలనిపించదు. పద్ధతిగా ఒద్దికగా అడిగితే సాధ్యం కానిది కూడా కష్టపడి తెచ్చివ్వాలనిపిస్తుంది. ఈ వినయం, విధేయత చిన్నతనంలోనే నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది....
చిన్నారులకు కావలసినవన్నీ సమకూర్చడంతో మన బాధ్యత తీరిపోదు. వాళ్ల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం చాలా అవసరం. వాళ్లు నిజాయతీ అలవరచుకోవడం ఎంత ముఖ్యమో వినయంగా ఉండటమూ అంతే అవసరం. ‘నాకిది కావాల్సిందే’ అని రుబాబుగా అడిగితే ఇవ్వాలనుకున్నది కూడా ఇవ్వాలనిపించదు. పద్ధతిగా ఒద్దికగా అడిగితే సాధ్యం కానిది కూడా కష్టపడి తెచ్చివ్వాలనిపిస్తుంది. ఈ వినయం, విధేయత చిన్నతనంలోనే నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది.
* అహంకారం, గర్వం ఎంత హాని చేస్తాయో కథల రూపంలో చెప్పాలి. సున్నితంగా మాట్లాడితేనే అభిమానం, ఆదరణ దొరుకుతాయి, కటువుగా మాట్లాడితే ఆత్మీయత దొరకదు, ఒంటరితనంతో బాధ పడాల్సి వస్తుందని అర్థమయ్యేలా చెప్పండి.
* పెద్దల్ని గౌరవించే పద్ధతులు చిన్నప్పుడే అలవాటు చేయాలి. లేదంటే భవిష్యత్తులో అనర్థాలు తప్పవని, అందరూ దూరం పెడతారని ఉదాహరణలతో వివరించండి.
* వయసుకు, విజ్ఞానానికి మర్యాద ఇవ్వాలంటూ పెద్దలు ఆచరించి చూపితే పిల్లలూ అనుసరిస్తారు.
* అందరితోనూ సౌమ్యంగా మాట్లాడాలని, ముఖ్యంగా పెద్దలను గౌరవించాలని, ఒద్దికగా ఉంటూ వాళ్ల అనుభవసారం నుంచి పాఠాలు నేర్చుకోవాలని తెలియజెప్పాలి. మర్యాద మన్ననలతో దేన్నయినా సాధించవచ్చని వివరించండి.
* అహంకారం కారణంగా పరాభవం చెందిన సంఘటనలూ సన్నివేశాలను సందర్భోచితంగా చెబుతుంటే పిల్లలు ప్రభావితమవుతారు. పెద్దలను గౌరవించడం, తోటి వారి పట్ల సానుభూతి చూపడం వంటివి నేర్చుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.