పసిపిల్లలకు ఏసీ వేస్తున్నారా?

ఎండలకు మనమే తట్టుకోలేకపోతున్నాం. ఇక పసివాళ్ల సంగతేంటి? ‘అందుకేగా ఏసీ ఏర్పాటు చేశాం’ అంటారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కొత్త సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.

Published : 26 Apr 2022 02:36 IST

ఎండలకు మనమే తట్టుకోలేకపోతున్నాం. ఇక పసివాళ్ల సంగతేంటి? ‘అందుకేగా ఏసీ ఏర్పాటు చేశాం’ అంటారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కొత్త సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.

* పిల్లలు గదిలో ఉన్నప్పుడు ఏసీ వేయొద్దు. ముందుగానే వేసి, వాతావరణం చల్లబడ్డాకే పిల్లల్ని గదిలోకి తీసుకెళ్లాలి. ఉష్ణోగ్రత 27 డిగ్రీలకంటే తగ్గకుండా చూసుకోవాలి. చల్లదనం నేరుగా వారి ముఖానికి తగలకుండా చూసుకోవాలి.

* ఏకధాటిగా వేసి ఉంచాల్సిన పనిలేదు. గది చల్లబడింది అనిపించాక ఆపేయొచ్చు. తలుపులు తరచూ తెరవకుండా ఉంటే చాలు.

* ఏసీ గాలికి పిల్లల లేత చర్మం పొడిబారుతుంది. కాబట్టి, ఎక్కువగా మాయిశ్చరైజర్‌ రాయండి. చేతులు, కాళ్లు కప్పే దుస్తుల్ని వేయాలి. ఇవి చలి నుంచి వారిని కాపాడతాయి. టోపీని కూడా పెట్టండి. దుప్పటి కప్పుతుంటే మోచేతుల కిందకే ఉండేలా చూసుకోండి.

* నిర్ణీత కాలవ్యవధుల్లో తప్పకుండా సర్వీసింగ్‌ చేయించండి. దీనిలోనూ దుమ్ము చేరుతుంటుంది. ఈ సూక్ష్మకణాలు వాళ్లలో ఆస్తమా, అలర్జీలకు కారణమవుతాయి. అందుకే సర్వీసింగ్‌ తప్పని సరి.

ఇంట్లో ఒక గదిలోంచి ఇంకో గదిలోకి పిల్లల్ని తీసుకెళ్లడం మామూలే. కానీ ఒక్కసారిగా చల్లటి వాతావరణం నుంచి వేడి ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్లొద్దు. ఇది అనారోగ్యానికి దారి తీస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్