తోబుట్టువులు లేకపోతే...

మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో చాలామంది ఒక్క బిడ్డకే పరిమితమవుతున్నారు. కానీ తోబుట్టువులు లేని పిల్లల పెంపకం కొన్ని సవాళ్లతో కూడుకున్నది. దీన్ని అధిగమించడానికి నిపుణుల సలహాలు ఏంటంటే...

Published : 13 Jun 2022 01:02 IST

మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో చాలామంది ఒక్క బిడ్డకే పరిమితమవుతున్నారు. కానీ తోబుట్టువులు లేని పిల్లల పెంపకం కొన్ని సవాళ్లతో కూడుకున్నది. దీన్ని అధిగమించడానికి నిపుణుల సలహాలు ఏంటంటే...

* మీ దగ్గర్లో వారి కజిన్స్‌ ఉంటే వారితో అనుబంధం ఏర్పడేలా చూడండి. తరచూ వాళ్లని కలుస్తూ, సమయం గడుపుతూ అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అంటూ బంధుత్వాలు కలపడంవల్ల తోబుట్టువులు లేని లోటు తెలియదు.

* బంధుత్వానికి మించిన బలం స్నేహానికి ఉంది. మంచి స్నేహితులు ఉంటే కూడా పిల్లలకు ‘ఒంటరి’ భావన కలగదు. కాబట్టి తోటి పిల్లలతో సమయం గడపనివ్వండి.

* ఇంటికి పరిమితం చేసేకొద్దీ వారిలో ఒంటరితనం పెరుగుతుంది. కాబట్టి పుట్టినరోజులు, పండగలప్పుడు ఒకే ఈడు పిల్లలు ఒకచేట చేరేలా చూడండి. మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేయండి. లేదంటే స్నేహితులూ, ఇరుగుపొరుగు, బంధువుల ఇంట్లో కార్యక్రమాలకు పిల్లల్నీ తీసుకువెళ్లండి.

* ఇచ్చి పుచ్చుకోవడం అలవాటు చేస్తే తోబుట్టువులులేని లోటు తోటి పిల్లలు తీర్చగలుగుతారు.

* హాబీలను పరిచయం చేయండి. పెయింటింగ్‌, క్రీడలు, సంగీతం... ఇలా ఏదోఒక దాంట్లో ప్రోత్సహించండి. తద్వారా తమలాంటి పిల్లల్ని కలిసే అవకాశం వస్తుంది. ఒంటరితనమూ ఉండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్